CSK vs MI : ముంబైపై చెన్నై ఘన విజయం

-

ముంబైలోని వాంఖడే స్టేడియంలో నేడు ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. అయితే.. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.అయితే.. 158 లక్ష్య ఛేదనకు దిగిన చైన్నై సూపర్‌ కింగ్స్‌ 18 ఓవర్లకే విజయం తీరాలకు చేరుకున్నారు. ఐపీఎల్ హిస్టరీలో రెండో వేగవంతమైన హాఫ్ సంచరీ రికార్డు మొయిన్ ఆలీ పేరిట ఉండగా.. దానిని అజింక్యా రహానే సమం చేశాడు. చెన్నై, ముంబై మధ్య జరుతున్న మ్యాచ్‌లో వన్ డౌన్‌గా దిగిన రహానే 19 బంతుల్లోనే అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. రహానే, రుతురాజ్ వీర విహారం చేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్.. సునాయస విజయం సాధించింది. 158 పరుగుల లక్ష్యాన్ని.. కేవలం మూడు వికెట్లు కోల్పోయి…18.1 ఓవర్లలో ఛేదించింది. ఈ గెలుపుతో చెన్నై వరుసగా రెండు విజయాలు సాధించగా.. ముంబై మాత్రం వరుసగా రెండో మ్యాచ్ ఓడిపోయింది.

MI vs CSK LIVE Score: Mumbai fall apart, 6 DOWN as Jadeja removes Tilak  Verma, Tim David anchors, Follow IPL 2023 LIVE

మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. రోహిత్ శర్మ, ఇషాన్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. కానీ రోహిత్ శర్మ 4వ ఓవర్, ఇషాన్ కిషన్ 7వ ఓవర్లో ఔట్ అయ్యారు. రోహిత్ 21, ఇషాన్ కిషన్ 32 పరుగులు చేశారు. వీరిద్దరు ఔట్ అయ్యాక.. వరుసగా వికెట్లు పడ్డాయి. సూర్య కుమార్ యాదవ్ మరోసారి నిరాశపరిచాడు. ఒకే ఒక్క రన్ చేసి వెనుదిరిగాడు. మధ్యలో హైదరాబాదీ ప్లేయర్ తిలక్ (22) వర్మ కాసేపు మెరుపులు మెరిపించాడు. కానీ ఆ తర్వాత జడేజా బౌలింగ్ వికెట్ల ముందు దొరికిపోయాడు. టిమ్ డేవిడ్ ధాటిగా ఆడడంతో స్కోర్ మళ్లీ పరుగులు పెడుతోందని ముంబై ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ 31 పరుగులు చేసి.. తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు డేవిడ్. గ్రీన్ 12, అర్షద్ 2 పరుగులు మాత్రమే చేశారు. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా అదరగొట్టాడు. మూడు కీలకమైన వికెట్లు తీశాడు. దేశ్‌పాండే 2, సాంట్నర్ 2 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news