ఈ-బైక్ ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్.. యువతి మృతి..!!

ఎలక్ట్రిక్ బైక్ వల్ల మరో ప్రాణం బలైంది. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఎలక్ట్రిక్ బైక్‌కు ఛార్జింగ్ పెడుతుండగా.. కరెంట్ షాక్ తగిలి ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్ర జిల్లాలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని సతారా జిల్లా కరాడ్ మండలం మోప్రో చెందిన శివానీ అనిల్ పాటిల్ (23) కొద్ది రోజుల కిందట ఆమె కుటుంబ సభ్యులు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేశారు. ఆదివారం రాత్రి స్కూటర్‌కు ఛార్జింగ్ పెట్టేందుకు ప్రయత్నించింది. దీంతో ఒక్కసారిగా ఆమెకు కరెంట్ షాక్ తగిలి.. విలవిల్లాడుతూ అక్కడే కుప్పకూలింది.

ఎలక్ట్రిక్ బైక్- యువతి
ఎలక్ట్రిక్ బైక్- యువతి

దీంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న కరాడ్ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్నామని, కేసుపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.