డ్రంక్‌ & డ్రైవ్‌లో వాహనాలను సీజ్ చేయవద్దు : సైబరాబాద్‌ సీపీ

-

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు.. సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వాహనాలను జప్తు చేసే అధికారం పోలీసులకు లేదని తేల్చి చెప్పింది హైకోర్టు. అలాగే మద్యం తాగిన వ్యక్తి బండి నడిపితే బంధువులను పిలిచి వాహనం అప్పగించాలని తెలిపింది.

ఈ నేపథ్యంలోనే తాజాగా… సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను మరియు ప్రొసీడింగ్స్ ను ఖచ్చితంగా పాటించాలి అని పేర్కొన్నారు సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర. న్యాయస్థానం నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు సీజ్ చేయొద్దు అన్నారు.

ఈ మేరకు శనివారం కమిషనరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ట్రాఫిక్ అధికారులతో దీక్ష నిర్వహించారు సైబరాబాద్ సిపి. రహదారి భద్రత పై ప్రత్యేక దృష్టి సారించి ప్రమాదాలను గణనీయంగా తగ్గించడానికి కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ అవగాహన సమావేశాలు పెంచాలని అలాగే పాదచారుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు సూచనలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news