వాహన రంగంలో ఎలక్ట్రిక్ కార్ల జోరు.. గతంతో పోలిస్తే పెరిగిన అమ్మకాలు

-

భారత వాహన మార్కెట్ లో క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి. పెరగుతున్న పెట్రోల్, డిజిల్ రేట్లను భరించలేక ప్రజలు EV ల వైపు చూస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ బైక్ లు, కార్ల అమ్మకాలు పెరిగాయి. ముఖ్యంగా కార్లు పెరుగుదల అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం అర్థభాగం( ఎప్రిల్1, 2021- సెప్టెంబర్ 30, 2021)లో గణనీయమైన పెరుగుదలను నమోదు చేశాయి. గతేడాది ఇదే కాలంతో ( ఎప్రిల్ 1,2020-సెప్టెంబర్30, 2020) పోలిస్తే 234 శాతం పెరుగుదల నమోదైంది.

అమ్మకాల్లో టాటా నెక్సాన్ టాప్:

భారత మార్కెట్ లో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా నెక్సాన్ టాప్ లో ఉంది. జిప్ ట్రాన్ టెక్నాలజీతో తయారైన టాటా నెక్సాన్ ఈఏడాది 3618 యూనిట్ల అమ్ముడయ్యాయి. దాదాపుగా గతేడాదితో పోలిస్తే 214 శాతం పెరుగుదల నమోదైంది. రెండో స్థానంలో ఎంజీ జెడ్ ఎస్ ఈవీ ఉంది. ఈ కారు 1784  యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాదితో పోలిస్తే అమ్మకాల్లో 250 శాతం పెరుగుదల నమోదైంది. మూడో స్థానంలో టాటా టిగోర్, నాలుగో స్థానంలో హ్యుందాయ్ కోనా వంటి ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి.

అయితే రానున్న రోజుల్లో మరిన్ని ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్ లోకి తీసుకువచ్చేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఫోక్స్ వ్యాగన్, మహీంద్రా వంటి కంపెనీలు తమ కొత్త ఈవీలను మార్కెట్ లోకి తీసుకున్నాయి. ఇదే విధంగా దేశంలో ఈవీ కార్ల ఉత్పత్తిలో ముందున్న దిగ్గజ టాటా కంపెనీ నుంచి ఆల్ట్రోజ్ ఈవీ, పంచ్ ఈవీ లు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news