తుఫాన్ పై కేంద్రం అలెర్ట్… ప్రధాని మోదీ సమీక్ష

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉండటంతో కేంద్రం కూడా అలెర్ట్ అయింది. ప్రస్తుతం అల్పపీడనంగా వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని వాతావరణ కేంద్రం తెలపింది. ఆ తరువాత తుఫాన్ ’జవాద్‘ గా మారే అవకాశం ఉంది. తీరానికి అతి సమీపంలోకి వచ్చి ఉత్తరాంధ్ర, ఒడిశా సమీపంలో తీరం దాటనుంది.

దీంతో తుఫాన్ పై కేంద్రం కూడా అలెర్ట్ అయింది. అధికారులతో ప్రధాని మోదీ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. తుఫాను ప్రభావంపై అధికారులు మోదీకి వివరించారు. బంగాళాఖాతంలో తుపాను ఏర్పడే అవకాశమున్న తరుణంలో.. ఉత్తర ఆంధ్రా, ఒడిశా తీరప్రాంతాల్లోని ప్రస్తుత పరిస్థితులను అధికారులు మోదీకి వివరించారు. ఈనెల 4న తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒడిశాలోని పలు జిల్లాలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. దీంతో 13 జిల్లాలు హై అలెర్ట్ ప్రకటించాయి. మరోవైపు ఒడిశాతో పాటు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలను పంచింది కేంద్రం.