కర్ణాటక డీజీపీ యూజ్ లెస్ : డీకే శివకుమార్

-

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అక్కడ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు హడావిడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక డీజీపీ అధికార బీజేపీకి కొమ్ము కాస్తుండటంపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ మండిపడ్డారు. డీజీపీ బీజేపీ నేతలకు రక్షకుడిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ‘డీజీపీ పనికిమాలిన వాడు. అతనిపై తక్షణమే కేసు నమోదు చేయాలి. అరెస్ట్‌ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్‌ ఈ డీజీపీని తొలగించాలి’ అని డీకే శివకుమార్‌ వ్యాఖ్యానించారు. ‘డీజీపీగా ఆయన మూడేండ్ల సర్వీస్‌ ముగిసింది. ఇంకెన్నాళ్లు పదవిలో ఉంటాడు. కేవలం కాంగ్రెస్ నేతలపై మాత్రమే ఆయన కేసులు నమోదు చేస్తున్నాడు. ఇప్పటికే మాపై 25కు పైగా కేసులు నమోదు చేశాడు’ అని ఆగ్రహం వ్యక్తం చేసారు శివకుమార్.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి రాబోతున్నామని, అప్పుడు ఆయనపై చర్యలు తప్పవని అన్నారు డీకే శివకుమార్‌ . కాగా, 2023 మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 150 సీట్లు గెలిచి పూర్తి మెజారిటీతో అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. జేడీఎస్‌ ఇప్పటికే 93 స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించింది. కాంగ్రెస్‌, బీజేపీ కూడా అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు చేపడుతున్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news