నెటిజన్‌ పశ్నకు.. రానా స్ట్రాంగ్‌ కౌంటర్‌..

-

తాతా రామానాయుడు, తండ్రి సురేష్‌ బాబు, చిన్నాన్న వెంకటేశ్‌ లాంటి బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నా రానా మాత్రం తనదైన శైలిలో పాత్రలు ఎంచుకొని.. సినిమాలు చేస్తుంటాడు. అయితే.. మొదట్నుంచీ డిఫరెంట్ కాన్సెప్టుల్నే ఎంచుకుంటూ వచ్చాడు రానా. పాత్రనే తప్ప ఇమేజ్‌‌‌‌‌‌‌‌ని పట్టించుకోడు. ఇతర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోడానికి కూడా రెడీగా ఉంటాడు. అంతేకాదు.. అవసరమైతే హీరోయిన్ ముందు తగ్గడానికి కూడా రెడీ అంటున్నాడు రానా. రానా హీరోగా నక్సల్‌‌‌‌‌‌‌‌ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కిన ‘విరాటపర్వం’ జూన్‌‌‌‌‌‌‌‌ 17న విడుదల కానుంది. ఇవాళ ట్రైలర్ వస్తోంది. ఈ విషయాన్ని చెబుతూ రీసెంట్‌‌‌‌‌‌‌‌గా ఓ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. అందులో సాయిపల్లవి కనిపిస్తోంది. రానా తల కట్ అయ్యి ఉంది. దాంతో ఓ నెటిజన్ కాస్త వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు.

Rana Daggubati joins forces with Viswashanthi Pictures for pan-India  project | Entertainment News,The Indian Express

‘సొంత నిర్మాణ సంస్థలోనే ఫేస్ కట్‌‌‌‌‌‌‌‌ చేసేశారు. ఆ సినిమాలోనో ఈ సినిమాలోనో తక్కువ నిడివి ఉన్న పాత్రలు చేయడం, అందరికీ లోకువ కావడం రానా స్టైల్’ అంటూ కామెంట్ చేశాడు. దానికి రానా ‘మనం తగ్గి కథని, హీరోయిన్‌‌‌‌‌‌‌‌ని ఎలివేట్ చేయడంలో ఉండే కిక్కే వేరు బ్రదర్. సొంత బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కదా.. గొప్పవన్నీ ఇక్కడే చేయొచ్చు’ అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. తన మాటలు అందరికీ నచ్చేశాయి. ‘ఏం చెప్పాడబ్బా’ అంటూ కాంప్లిమెంట్స్ కురిపిస్తున్నారు. అది మాత్రమే కాదు.. ఒక అసాధారణ పాత్రలో మిమ్మల్ని చూడాలనుందంటూ ఒక అభిమాని ట్వీట్ చేస్తే.. నెక్స్ట్ అలాంటిదే చేస్తానని, విరాటపర్వం రిలీజ్ తర్వాత ఆ వివరాలు చెప్తానని క్లారిటీ ఇచ్చాడు ఈ దగ్గుబాటి బుల్లోడు.

Read more RELATED
Recommended to you

Latest news