హీరో దళపతి విజయ్ ఫేక్ అవార్డ్స్ తో మోసం చేస్తున్నాడు..!!

-

ఇప్పుడున్న ఇంటెర్నెట్ యుగంలో ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది ప్రజలకు అర్ధం కాకుండా ఉంది. ఇక సినిమా పరిశ్రమ అనేది ఒక మాయ ప్రపంచం. ఇక్కడ ప్రభుత్వం ఇచ్చే అవార్డ్స్ కూడా రికమండేషన్ చేశి మరీ తెచ్చుకుంటారు. ఇక ప్రైవేట్ సంస్థలు ఇచ్చే అవార్డ్స్ కు అస్సలు విశ్వసనీయత ఉండటంలేదు. అర్హత లేని వాళ్ళను కూడా అందలం ఎక్కిస్తారు, అవార్డ్స్ ఇస్తారు. ప్రస్తుతం ఇలాంటి వివాదం ఒకటి నడుస్తోంది.

ప్రముఖ మీడియా సంస్థ ఆర్మార్క్స్ మీడియా ఎప్పటిలాగే విడుదల చేసే ఆర్మాక్స్ స్టార్స్ మోస్ట్ పాపులర్ మేల్ ఫిలిం స్టార్స్ ఫ్యాన్ ఇండియా లెవెల్ లిస్ట్ విడుదల చేసింది.ఇందులో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ దక్కించుకున్నాడు అనే విషయం వివాదంగా మారింది.ఇక  హీరో ప్రభాస్  రెండోవ స్థానంలో, మూడవ స్థానంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నిలిచారు.  జూనియర్ ఎన్టీఆర్ నాలుగవ స్థానం దఅల్లు అర్జున్ ఐదవ స్థానం, యష్ ఆరవ స్థానం, తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ఏడో స్థానంలో ఉన్నాడు.ఇక మహేష్ బాబు ఎనిమిదో స్థానం దక్కించుకోగా షారుక్ ఖాన్ మాత్రం తొమ్మిదవ స్థానం దక్కించుకున్నారు. ఇకరామ్ చరణ్ పదవ స్థానం  లో ఉన్నాడు.

ఇప్పుడు దీనిపై రగడ నడుస్తోంది. పెద్ద పెద్ద పాన్ ఇండియా స్టార్స్ కు నంబర్ వన్ స్థానం రాకుండా విజయ్ కు ఇవ్వడం తో అందరూ మండిపడుతున్నారు. ఈ ఒక్క సారే కాదు గతంలో కూడా ఇలాగే చేశారని మిగిలిన హీరోల ఫ్యాన్స్ గోల గోల చేస్తున్నారు.ముఖ్యంగా తమిళంలో అజిత్ అభిమానులు మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అజిత్ కి ఏడవ స్థానం ఇవ్వడం విజయ్ కి మొదటి స్థానం ఇవ్వడంతో ఇదంతా ఫేక్ అని ట్రోల్ చేస్తున్నారు. చూస్తూంటే ఇదో పెద్ద వివాదంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news