వెంకటాద్రి ఎక్ప్రెస్ సినిమాతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అని చెప్పాలి. మొదటి సినిమా చిన్న హీరో సందీప్ కిషన్ తో ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికి ఒక్కసారిగా ఏ హీరోయిన్ కి దక్కనంత స్టార్ డం దక్కింది. దాంతో టాలీవుడ్ లో స్టార్ హీరోలదరి తోను నటించి సూపర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇక రకుల్ ఒక సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకే డేట్లు సర్ధుబాటు చేయలేనంటు తెగేసి చెప్పింది.
అయితే ఆ తర్వాత మురగదాస్ డైరెక్షన్ లో మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమాకు మళ్లీ పిలిచి మరీ రకుల్ ప్రీత్ సింగ్ కు ఛాన్స్ ఇచ్చేలా చేసింది. ఆ రేంజ్ లో రకుల్ దాదాపు మూడు ఏళ్ళు టాలీవుడ్ ను ఏలేసింది. అయితే అంతలోనే రకుల్ కి వరుసగా ఫ్లాప్స్ పడి జారి కిందపడిపోయింది. మళ్ళీ పైకి లేవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నప్పటికి అది సాధ్యపడటం లేదు.
ప్రస్తుతం రకుల్ సౌత్ లో హీరోయిన్స్ రెమ్యూనరేషన్ విషయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. సౌత్ లో హీరోలు మాత్రమే ప్రేక్షకులను థియేటర్లకు తీసుకు రాగలరు కాబట్టే… వాళ్ళకి భారీగా రెమ్యూనరేషన్స్ ఇస్తారు. ఆ రేంజ్ లో హీరోయిన్స్ కు ఉండాలని నేను అనుకోను. ఈ లాజిక్ ను అర్థం చేసుకున్నాను. అందుకే నేనెప్పుడు రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతలను ఇబ్బంది పెట్టలేదంటూ వెల్లడించింది. ఇక టాలీవుడ్ లో ప్రస్తుతం అవకాలేమీ లేని రకుల్ బాలీవుడ్ లో మాత్రం ఒక సినిమా చేస్తున్నట్టు సమాచారం.