దుబాయ్‌లో భర్త.. బంధువుతో రాసలీలలు.. మామకు తెలిసి..

-

రానురాను బంధాలకు విలువులు లేకుండా పోతున్నాయి. వావివరుసతలు మరిచి శారీరక సుఖంకోసం చెడు దారులు తొక్కుతున్నారు. విషయం బయటపడే సరకి క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని.. జీవితాలను అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. అలాంటి ఘటనే ఇది.. గత ఆదివారం అర్ధరాత్రి ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో జరిగిన కుమ్మరి నడిపి గంగా రాం (61) హత్య జరిగింది. అయితే ఈ హత్యపై సమాచారం అందడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు మొదలుపెట్టారు. దీంతో నిందితురాలు ఇంటి కోడలే అని తెలిసి పోలీసులు షాక్‌ అయ్యారు.

tamil nadu illegal affair: కామంతో బరితెగించిన ఆంటీ.. యువకుడితో  శృంగారలీలలు.. చివరికి.. - woman kills husband with paramour in tamil nadu |  Samayam Telugu

నడిపి గంగారాం చిన్న కొడుకు దుబాయ్‌కు వెళ్లగా అతడి భార్య లత సమీప బంధువు మదన్‌పల్లి గ్రామానికి చెందిన దుంపటి శ్రీనివాస్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. వీరి వివాహేత సంబంధం తెలుసుకున్న మామ, చిన్న కొడుకు దృష్టికి తీసుకురావడంతోపాటు కోడలిని మందలించి శ్రీనివాస్‌తో తన పొలం కౌలు మాన్పించాడు. దీంతో లత ఆరునెలలుగా సిరికొండ మండలం తూంపల్లిలోని తల్లిగారింటి వద్దనే ఉంటోంది. ఇటీవలే వరి కోతలు పూర్తికావడంతో ఆ పంట మొత్తం తనకే ఇవ్వాలని కోడలు లత, శ్రీనివాస్‌తో కలిసి 23న మామ గంగారాంతో గొడవకు దిగింది. 24న రాత్రి శ్రీనివాస్‌ మదన్‌పల్లి గ్రామానికి చెందిన బి.సురేష్‌ను వెంట తీసుకుని గన్నారం గ్రామానికి వచ్చాడు.

వడ్ల కుప్పపై పడుకున్న గంగారాం ఛాతీపైన కూర్చుని శ్రీనివాస్‌ వెదురు కర్రతో గొంతుపైన అదిమి, పక్క నే ఉన్న రాయితో తలపై కొట్టి హత్య చేశాడు. ఇందుకు సురేష్‌ సహకరించారు. అలికిడికి పక్కనే మరో వడ్ల కుప్ప వద్ద కాపలాగా ఉన్న వృద్ధుడు జాజుల పెద్దనారాయణ నిద్రలేచి వీరిని అడ్డుకోవాలని చూడగా అతడిపై రాయితో దాడి చేసి హత్యాయత్నం చేశారు. వేరే వాహనాలు రావడంతో అక్కడి నుంచి నిందితులిద్దరూ పరారయ్యారు. సమాచారం అందుకున్న ఇందల్వాయి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీస్‌ విచార ణలో శ్రీనివాస్, సురేష్, లత అలియాస్‌ లావణ్య నేరాన్ని అంగీకరించడంతో వారిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేధించిన సీఐ ప్రతాప్, ఇందల్వాయి ఎస్సై నరేష్, కానిస్టేబుళ్లను ఏసీపీ అభినందించారు. వీరికి ప్రశంసా పత్రాలతో పాటు రివార్డులు అందజేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news