BREAKING : డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్‌ ?

-

BREAKING : ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్ కి ఆడుతున్నప్పటి నుండి తెలుగు వారికి చాలా దగ్గరయ్యాడు. ఆటలో ఒంటిచేత్తో గెలిపిస్తూ సన్ రైజర్స్ టీమ్ ని విజయతీరాలకి చేర్చడమే కాకుండా, ఆట ముగిసిన తర్వాత తనదైన టిక్ టాక్ వీడియోలతో అలరిస్తూ ఉంటాడు.

అయితే.. తాజాగా ఈ ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్..సంచలన ప్రకటన చేశాడు. తాజాగా ఓ ఛానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. రిటైర్మెంట్‌ ఇప్పుడే ఆలోచన లేదని.. ఒకవేళ రిటైర్మెంట్‌ ప్రకటిస్తే.. మొదటగా, టెస్టులకు గుడ్‌ బై చెబుతానని వ్యాఖ్యనించాడు వార్నర్‌. కానీ, వన్డేలు, టీ20 లు ఆడతానని చెప్పాడు వార్నర్‌. ఇక దీంతో.. టెస్టులకు డేవిడ్‌ వార్నర్ రిటైర్మెంట్‌ ప్రకటించబోతున్నాడని వార్తలు వైరల్‌ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news