నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌లో చందాదారుడు చనిపోతే… ఆ ప్రయోజనాలని ఇలా పొందొచ్చు..!

-

చాలా మంది వారికి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులని పెడుతూ వుంటారు. నిజానికి మనం డబ్బులని స్కీమ్స్ లో పెట్టడం వలన ఎన్నో లాభాలని పొందేందుకు అవుతుంది. భవిష్యత్తు ఆర్థిక అవసరాల కోసం చాలా మంది నచ్చిన స్కీమ్స్ లో డబ్బులని పెడుతున్నారు. నేషనల్‌ పెన్షన్ సిస్టమ్‌లో కూడా చాలా మంది డబ్బులని పెడుతున్నారు. ఒకవేళ కనుక పొదుపు చేసిన చందాదారుడు మరణిస్తే అతను డెత్ బెనిఫిట్స్‌ ని ఎలా పొందొచ్చు అనేది చూద్దాం.

ఏదైనా పొదుపు పథకాల్లో ఖాతాదారుడు లేదా చందాదారుడు చనిపోతే పొదుపు చేసిన డబ్బు అతని చనిపోతే కుటుంబ సభ్యులు లేదా నామినిగా ఇస్తారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ నేషనల్ పెన్షన్ సిస్టమ్‌ను నిర్వహిస్తోంది. స్వచ్చంద రిటైర్ మెంట్ ప్రొగ్రామ్ ఇది. మార్కెట్ బేస్డ్ రిటర్న్స్ ను ఇస్తుంది. రిటైర్ మెంట్ అయ్యాక పెన్షన్ తో పాటుగా మరణం సంభవిస్తే నామినీ లేదా చట్టబద్ధ వారసులకు ఈ డబ్బులు వస్తాయి.

డెత్ బెనిఫిట్స్ లో మొత్తం డబ్బును ఒకసారి పొందవచ్చు. లేదంటే పెన్షన్ ని పొందడానికి వీలుగా యాన్యుటీని తీసుకోవచ్చు. ఒకవేళ నామినీ లేదా చట్టబద్ధ వారసులు చనిపోతే చందాదారుడి డెత్ సర్టిఫికెట్ ను సంబంధిత అధికారుల నుండి తీసుకోవాలి. ఇఎన్‌పిఎస్‌ పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటే అవసరమైన డాక్యుమెంట్లను ఇచ్చి విత్ డ్రా ఫామ్ ను ఫిల్ చేసి సబ్మిట్ చెయ్యాల్సి వుంది. www.npscra.nsdl.co.in వెబ్ సైట్ నుంచి విత్ డ్రా ఫామ్ పొందొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news