న్యాయమూర్తుల నియామకాలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

-

సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వారి నియామకాలకు సంబంధించి కొలీజియం పునరుద్ఘాటించిన పేర్లను కేంద్రం వెనక్కి పంపడంపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. అభ్యంతరం వ్యక్తం చేయడానికి ఎలాంటి కారణాలు లేకున్నా సిఫార్సులను అడ్డుకోవడం సరికాదని పేర్కొంది.

కొలీజియం కంటే మెరుగైన వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తే, ఎవరూ నిరోధించరని, కానీ ఆ సమయం వరకు అమల్లో ఉన్న చట్టాన్ని కచ్చితంగా అమలుపరచాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను ఆమోదించకుండా కేంద్రం ఆలస్యం చేస్తోందంటూ దాఖలైన పలు పిటిషన్లపై శుక్రవారం జరిగిన విచారణ సందర్భంగా జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ ఎ.ఎస్‌.ఓకా ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.

“ఇది ఆందోళన కలిగించే విషయం. ఈ విషయాన్ని గత ఉత్తర్వుల్లోనూ లేవనెత్తాం” అని న్యాయమూర్తులు పేర్కొన్నారు. దీంతో పేర్లను ఆమోదించే ప్రక్రియను సుప్రీంకోర్టు నిర్దేశించిన కాలావధుల్లో పూర్తి చేస్తామని సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్రం హామీ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news