భారతీయుడు 2 : కాజల్‌ స్థానంలో ఆ బాలీవుడ్‌ బ్యూటీ !

-

కోలీవుడ్ దర్శక దిగ్గజం శంకర్ షణ్ముగం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భారతీయుడు 2. రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు సిద్దార్థ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఎంతో గ్రాండ్ గా ప్రారంభం అయిన ఈ సినిమా షూటింగ్ లో కొద్దిరోజుల క్రితం ఒక ఘోర ప్రమాదం జరిగి, సెట్ లోని భారీ క్రేన్ విరిగి పడి సెట్ లోని వారిలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మారుతీ చెందారు. అయితే ఆ దుర్ఘటనతో ఒక్కసారిగా కోలీవుడ్ తో పాటు మిగతా సినిమా పరిశ్రమలు కూడా ఉలిక్కిపడ్డాయి.

ఇది ఇలా ఉండగా ఈ సినిమా నుంచి ఓ రూమర్ స్ప్రెడ్ అవుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తున్న కాజల్ ఇప్పుడు అందుబాటులో లేదు. ఇటీవల ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చిత్ర బృందం మళ్లీ హీరోయిన్ వేటలో పడిందట. ఇండియన్ 2 హీరోయిన్ గా కాజల్ స్థానంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అయిన దీపిక పదుకొనే, కత్రినా కైఫ్ పేర్లను పరిశీలిస్తున్నారట. అంతేకాదు ఇటీవల వారితో మూవీ టీం సంప్రదింపులు కూడా జరిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి వారు సమాధానం ఇవ్వాల్సి ఉందని వినికిడి. ఇక ఇండియన్ 2 హీరోయిన్ పై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగక తప్పదు.

Read more RELATED
Recommended to you

Latest news