ఫస్ట్ సాంగ్ : సర్కారు వారి “పాట” అదిగో! ఎప్పుడంటే?

-

ఆర్ఆర్ఆర్ విడుద‌ల వాయిదా ప‌డ‌డంతో ఇండ‌స్ట్రీలో ఉన్న ప్ర‌తి సినిమాపై ఆ నిర్ణ‌యం ప్ర‌భావం బాగానే ప‌డింది. తాజాగా మ‌హేశ్ బాబు సినిమా స‌ర్కారు వారి పాట ఎప్పుడన్న‌ది తెలియ‌క పోయినా, మొద‌టి పాట‌కు సంబంధించి మాత్రం ఓ క‌బురు మాత్రం ఫిల్మ్ న‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది.దీంతో ప్రిన్స్ అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఎప్ప‌టి నుంచో సినిమాకు సంబంధించి ఎటువంటి వివ‌రాలు వెలుగులోకి రావ‌డం లేదు.

సినిమా విడుద‌లపై ఎన్నో ఆశ‌లు పెంచుకున్నా ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆశించిన విధంగా అనుకున్న స‌మ‌యానికి థియేట్రిక‌ల్ మానియాను చూడ‌డం అన్న‌ది జ‌ర‌గ‌ని ప‌ని! అందుకే అన్నీ బాగుంటేనే సినిమాల విడుద‌ల‌పై ఆస‌క్తి చూపిస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. క‌రోనా ఉద్ధృతి ఉండ‌డంతో ఏం చేసినా రిస్క్ అన్న భావ‌న ఒక‌టి ప్ర‌తి ఒక్క‌రినీ వెన్నాడుతోంది.క‌నుక సినిమాల విష‌య‌మై హీరోలు ఇదివ‌ర‌కు వేగంతో నిర్ణ‌యాలు తీసుకోలేక‌పోతున్నారు.అయిన‌ప్ప‌టికీ కొద్ది రోజుల్లో ప‌రిస్థితుల్లో మార్పులు వ‌చ్చే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయ‌న్న సంకేతాలు రావ‌డంతో ఇప్పుడిప్పుడే వీలున్నంత మేర అప్డేడ్స్ ఇచ్చేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు.

మ‌హేశ్ బాబు, కీర్తి సురేశ్ జంట‌గా న‌టించిన మోస్ట్ ఎవైటింగ్ మూవీ స‌ర్కారు వారి పాటకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇది.ఈ సినిమాకు సంబంధించి ఫిబ్ర‌వ‌రి 14న మొద‌టి పాట విడుద‌ల కానుంద‌ని నిర్థార‌ణ అయింది. ఇందుకు సంబంధించిన వార్త ఒక‌టి చిత్ర‌వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది.ఇప్ప‌టిదాకా ఈ సినిమాకు సంబంధించి పెద్ద‌గా వార్త‌లేవీ రావ‌డంలేదు. విడుద‌ల తేదీ కూడా ఇంకా డైలమాలోనే ఉంది. ఈ త‌రుణంలో వాలంటైన్స్ డే సంద‌ర్భంగా మ‌హేశ్ అభిమానుల‌కు మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ థ‌మ‌న్ కానుక ఇవ్వ‌నున్నారు అని స్ప‌ష్టం అయిన సంకేతాల‌యితే చిత్ర యూనిట్ ఇస్తోంది.ఇక సినిమా విడుద‌ల కూడా వేస‌విలోనే ఉండే ఛాన్స్ ఉంది.ప‌రశురాం దర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను మ‌హేశ్ బాబుతో స‌హా మైత్రీ మూవీ మేక‌ర్స్, 14 రీల్ ప్ల‌స్ నిర్మాణ సంస్థ‌లు నిర్మించాయి.

Read more RELATED
Recommended to you

Latest news