కేజ్రీవాల్‌ సంచలన నిర్ణయం.. పెట్రోల్‌ పై రూ.8 తగ్గింపు

-

ఇండియాలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశం లో పెట్రోల్‌ ధరలు సెంచరీ దాటి.. 150 కి చేరువ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో… ఇటీవల కేంద్రం ప్రభుత్వం… పెట్రోల్‌ పై రూ.5 , డీజిల్‌ పై రూ. 10 మేర ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది. దీంతో దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కాస్త తగ్గాయి.

కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో దేశంలోని చాలా రాష్ట్రాలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాయి. ఇలాంటి తరుణంలోనే.. వాహనదారులకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ శుభవార్త చెప్పారు. పెట్రోల్‌పై వ్యాట్‌ను 30% నుండి 19.40%కి తగ్గిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది కేజ్రీవాల్‌ సర్కార్‌. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.8 మేర తగ్గనుందని కేజ్రీవాల్‌ సర్కార్‌ పేర్కింది. అంతేకాదు.. ఈ కొత్త రేట్లు ఈ రోజు అర్ధరాత్రి నుండి అమలులోకి వస్తుందని తెలిపింది సర్కార్‌. ఇక కేజ్రీవాల్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో..  వాహనదారులు ఖుషీ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news