రికవరీ రేటులో దేశానికే ఢిల్లీ ఆదర్శం… దుమ్ము రేపింది అంతే…!

-

మా రాష్ట్రంలో కరోనా కేసులు జులై చివరి నాటికి 5 లక్షలు దాటే అవకాశం ఉంది కాబట్టి మేము ఇతర రాష్ట్రాల వారికి ఢిల్లీలో ఆస్పత్రులను ఇవ్వలేము. దయచేసి వారు కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో జాయిన్ అయితే మంచిది… ఒక నెల రోజుల క్రితం అనుకుంట ఢిల్లీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. కాని ఇప్పుడు మాత్రం అక్కడ కరోనా కేసులు లక్షా 30 వేలు కూడా దాటి నమోదు కాలేదు.

నాలుగు వేల కేసులు వచ్చేవి రోజు… ఇప్పుడు వెయ్యి లోపు వచ్చాయి. కొత్తగా 954 కేసులతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,23,747 కు పెరిగిందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యేంద్ర జైన్ వివరించారు. ఇప్పటి వరకు 1,04,918 మంది కోలుకున్నారని రికవరీ రేటు 84 శాతం ఉందన్నారు ఆయన. అంటే ఢిల్లీ లో యాక్టివ్ కేసులు 20 వేలు కూడా లేవు. 50 వేల లోపు ఉన్న రాష్ట్రాలే 30 వేల యాక్టివ్ కేసులు ఉంటే ఢిల్లీలో మాత్రం ఇది పరిస్థితి.

Read more RELATED
Recommended to you

Latest news