ఢిల్లీ లిక్కర్ స్కామ్.. వైసీపీ ఎంపీ కుమారుడిని 10 రోజుల కస్టడీకి కోరిన ఈడి

-

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతడిని ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో ప్రశ్నించాక అరెస్టు చేసినట్లు ఈడి వెల్లడించింది. ఈ సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం రాఘవరెడ్డిని ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు.

ఈ సందర్భంగా రాఘవను పది రోజులపాటు కష్టాడీకి ఇవ్వాలని కోరారు ఈడీ అధికారులు. ఈ కేసులో రాఘవ కీలక నిందితుడు అని, వ్యక్తులతో కలిపి విచారించాల్సి ఉందని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు ఈడి అధికారులు. ఇక ఇదే కేసులో ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును హైదరాబాద్ లో మంగళవారం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ ప్రత్యేక జడ్జ్ ఎంకే నాగపాల్ మూడు రోజుల సిబిఐ కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news