హైదరాబాద్ లో ట్రాఫిక్ చలాన్లు మాఫీ చేయండి – అక్బరుద్దీన్ ఓవైసీ

-

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ లో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ చలాన్లు మాఫీ చేయండని డిమాండ్‌ చేశారు అక్బరుద్దీన్ ఓవైసీ. హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను నియంత్రించడం లేదని ఫైర్‌ అయ్యారు.

ఏదో ఒక మూలన కూర్చుని వెహికల్స్ కు చాలన్ వేసే పనిలో ఉంటున్నారన్నారు. జనం ఇప్పటికే పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్నారు… వాళ్ల పైన కొద్దిగా దయ చూపండని కోరారు. ఇప్పటికే గ్యాస్ పెట్రోలు డీజిల్ ధర లతో జనం పరేషాన్ అవుతున్నారు… ఇంట్లో నుంచి బయటకు వస్తే ట్రాఫిక్ పోలీసులను చూసి పరేషాన్ అవుతున్నారని తెలిపారు. ఈ ట్రాఫిక్ చాలన్లతో ఇబ్బంది పడుతుంది పేదవాళ్లే…చిన్న చిన్న చాలాన్ లు ఉంటే..మాఫీ చేసే ఆలోచన చేయండని కోరారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ.

Read more RELATED
Recommended to you

Latest news