రాహుల్ గాంధీకి పాస్ పోర్ట్ ఇవ్వడానికి కోర్ట్ గ్రీన్ సిగ్నల్….

-

కొంతకాలం క్రిందట పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి, దీనితో ఆయనకు రెండేళ్ల శిక్ష విధిస్తూ కోర్ట్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో అతను తన దగ్గర ఉన్న దౌత్య పాస్ పోర్ట్ ను అధికారులకు ఇచ్చివేశారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ తనకు కొత్త పాస్ పోర్ట్ ను ఇవ్వాలని ఢిల్లీ మెజిస్ట్రేట్ కు పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన మెజిస్ట్రేట్ కోర్ట్ తాజాగా రాహుల్ గాంధీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీకి పాస్ పోర్ట్ కు ఇస్యూ చేయడానికి ఇచ్చింది కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే.

ఆ తర్వాత మళ్ళీ రెన్యూవల్ చేయించుకోవడం లేదా ఎక్కువ కాలానికి రీ ఇస్యూ చేయించుకోవడమే చేయాల్సి ఉంది. ఢిల్లీ కోర్ట్ ఇచ్చిన ఈ తీర్పు పట్ల కాంగ్రెస్ పార్టీ హర్షాన్ని వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news