నోట్ల రద్దు వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు. నోట్ల రద్దు తర్వాత దేశంలో పెద్ద నోట్ల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. నోట్ల రద్దు తర్వాత దేశంలో అవినీతి, నల్లధనం పెరిగిందన్నారు. నోట్ల రద్దు లక్ష్యాలను కేంద్రం చేరుకోలేకపోయిందన్నారు హరీష్ రావు. కేంద్రం నోట్ల రద్దు నిర్ణయం ఒక దిక్కుమాలిన చర్య అని చెప్పకనే చెప్పారని అన్నారు.
బిజెపి నేతలు నోట్ల రద్దు గురించి ఎవరూ మాట్లాడడం లేదని.. నోట్ల రద్దు అట్టర్ ప్లాప్ షో అని ఎద్దేవా చేశారు. దేశ ప్రజల మీద నోట్ల రద్దు నిర్ణయం.. ఉరుములు లేకుండా పిడుగు పడ్డట్టు అయిందన్నారు. దీనివల్ల పెద్ద నోట్ల చెలామని తగ్గకపోగా రెండింతలు పెరిగిందని విమర్శించారు. అంతేకాదు నోట్ల రద్దు తర్వాత డ్రగ్స్ వాడకం, ఉగ్రవాదం పెరిగిపోయాయని ఆరోపించారు. డిమానిటైజేషన్ పై దేశ ప్రజలకు కేంద్రం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.