నియామ‌క బోర్డుల అధికారుల‌తో సీఎస్‌ శాంతి కుమారి స‌మీక్ష

-

టీఎస్‌పీఎస్సీ భ‌ర్తీ చేస్తున్న అసిస్టెంట్ ఇంజినీర్ ప్ర‌శ్నాప‌త్రం లీకైంద‌ని తెలియగానే ఉద్యోగ నియామ‌కాల‌పై సీఎస్ శాంతి కుమారి స‌మీక్ష నిర్వహించారు. తాత్కాలిక స‌చివాల‌యం బీఆర్‌కే భ‌వ‌న్‌లో నియామ‌క బోర్డుల అధికారుల‌తో శాంతి కుమారి ఈ స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మీక్షా స‌మావేశానికి టీఎస్‌పీఎస్సీ కార్య‌ద‌ర్శి అనితా రామ‌చంద్ర‌న్‌ , గురుకుల నియామ‌క బోర్డు కార్య‌ద‌ర్శి మ‌ల్ల‌య్య భట్టు, వైద్య నియామ‌క బోర్డు జేడీ గోపీకాంత్, ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ ఆర్ లింబాద్రి, ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శి రోనాల్డ్ రాస్, జీఏడీ ముఖ్య కార్య‌ద‌ర్శితో పాటు ప‌లువురు అధికారులు వచ్చారు.

ఈ నెల 5వ తేదీన జ‌రిగిన అసిస్టెంట్ ఇంజినీర్ రాత‌ప‌రీక్ష ప్ర‌శ్నాప‌త్రం లీకైంద‌ని స‌మాచారం అందడంతో, టీఎస్‌పీఎస్సీ అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ నెల 12న జ‌ర‌గాల్సిన టీపీబీవో, 15, 16 తేదీల్లో జ‌ర‌గాల్సిన వెట‌ర్నరీ అసిస్టెంట్ స‌ర్జ‌న్ పోస్టుల రాత‌ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసింది టీఎస్‌పీఎస్సీ. ఏఈ పేప‌ర్ లీక్ కేసులో టీఎస్‌పీఎస్సీలో సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌ రాజశేఖర్‌రెడ్డిని ఉద్యోగంలో నుంచి తొలగించడం జరిగింది. అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌కుమార్‌ను కూడా సస్పెండ్‌ చేశారు అధికారులు. గురుకుల ఉపాధ్యాయురాలు రేణుక, ఆమె భర్త డీఆర్‌డీఏలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఢాక్య, కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ను రిమాండ్‌కు తరలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ముగ్గురిపై నేడో, రేపో అధికారికంగా చర్యలు తీసుకోనున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news