ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన డిప్యూటీ తహశీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డి మీద వేటుపడింది. ఆనంద్ కుమార్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. చంచల్‌గూడ జైలులో ఉన్న అనంద్‌కుమార్ రెడ్డికి కలెక్టర్ ఆదేశాల్ని అందజేయనున్నారు.
మూడ్రోజుల క్రితం పదోన్నతి గురించి మాట్లాడేందుకని డిప్యూటీ తహశీల్దార్… జూబ్లీహిల్స్ లో ఉంటున్న ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ ఇంట్లోకి అక్రమంగా వెళ్లేందుకు యత్నించారు. వెంటనే స్మితా సభర్వాల్ ఆగ్రహం వ్యక్తం చేయటంతో భద్రతా సిబ్బంది..డిప్యూటీ తహశీల్దార్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. డిప్యూటీ తహశీల్దార్ చొరబాటు ఘటనపై ట్వీట్ చేసిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ .. ఓ అర్ధరాత్రి బాధాకరమైన అనుభవం ఎదురైందంటూ పేర్కొన్నారు.