టీడీపీలో కరోనా కల్లోలం.. దేవినేని ఉమాకు పాజిటివ్

-

తెలుగు దేశం పార్టీ కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ఆ పార్టీలో వరుసగా పెద్ద లీడర్ల నుంచి చిన్న లీడర్ల వరకు అందరికీ కరోనా పాజిటివ్‌ గా నిర్దారణ అవుతోంది. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమా కు కరోనా పాజిటివ్‌ గా నిర్దారణ అయింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్‌ లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ లో తెలిపారు.

” నేను కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయినది. డాక్టర్ల సలహా మేరకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.” అంటూ పేర్కొన్నారు దేవినేని ఉమా. ఇక ఇది ఇలా ఉండగా… ఇవాళ ఉదయమే… తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి కరోనా పాజిటివ్‌ గా నిర్దారణ అయింది. అటు నారా లోకేష్‌ కు కూడా నిన్న కరోనా పాజిటివ్‌ గా నిర్దారణ అయింది. దీంతో వీరంతా హోం ఐసోలేషన్‌ లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news