వింత ఆచారం.. అక్కడ అమ్మవారికి చెప్పులు సమర్పిస్తారు..!

-

మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు వింత ఆచారాలు పాటిస్తుంటారు. అవి వారి పూర్వీకుల నుంచి ఆనవాయితీగా వస్తోందని భావిస్తూ ఉంటారు. ఇలాంటి ఓ వింత ఆచారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని కోలా ప్రాంతంలో ఉంది. అదేంటంటే..?

సాధారణంగా ఏదైనా ఆలయానికి వెళితే.. చెప్పులు బయటే విడిచి వెళతాం. కానీ మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని కోలా ప్రాంతంలోని జిజిబాయ్‌ ఆలయం లేదా పహడా వాలీ మాతా మందిరానికి వెళ్తే నవరాత్రుల్లో భక్తులే స్వయంగా మాతా రాణి అమ్మవారికి చెప్పులు, బూట్లు వంటివి సమర్పిస్తారు. ఇక్కడ కొలువైన అమ్మవారు రాత్రిపూట చెప్పులు ధరిస్తారనేది భక్తుల విశ్వాసం. అమ్మవారికి చెప్పులు, బూట్లు సమర్పిస్తే ప్రసన్నురాలు అవుతుందని కూడా నమ్ముతారు.

ఇక్కడి ఆలయంలోని అమ్మవారిని భక్తులు కుమార్తెగా భావిస్తారని, అందుకే చెప్పులు, బూట్లతోపాటు టోపీ, కళ్లద్దాలు, వాచీ వంటివి సమర్పిస్తారని పూజారి ఓంప్రకాశ్‌ మహారాజ్‌ తెలిపారు. నవరాత్రుల సందర్భంగా విదేశాల నుంచి సైతం భక్తులు అమ్మవారికి చెప్పులు, అలంకరణ సామగ్రి పంపిస్తారని   వెల్లడించారు. ఈ సారి సింగపూర్‌, ప్యారిస్‌, జర్మనీ, అమెరికా దేశాల్లోని భక్తుల నుంచి అమ్మవారికి చెప్పులు అందాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news