తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిన్న ఒక్క రోజే ఏకంగా 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. అటు నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 70, 338 మంది భక్తులు దర్శించుకున్నారు. అటు కోసం నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారికి 22, 741 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అటు నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.96 కోట్లుగా నమోదు అయింది.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/01/ttd-news-1.jpg)
నేడు తిరుమల శ్రీవారి మే నెల టికెట్లు విడుదల కానున్నాయి. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా ఉ.10గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల కానున్నాయి. ఈ మేరకు టీటీడీ అధికారిక ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవలకు లక్కిడిఫ్ విధానంలో పోందడానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని పేర్కొంది టీటీడీ. ఇక ఈ టికెట్ల కోసం Tirumala Tirupati Devasthanams (Official Website..https://www.tirumala.org/)ను సంప్రదించాల్సి ఉంటుంది.