రాజకీయంలో ఆయనకు సాటే లేరు..మాట తీరులో ఆయనకున్న పట్టుకు మరొకరు పోటీ రారు రాలేదు కూడా! అవును! కేసీఆర్ రియల్ లీడర్..తిరుగులేని లీడర్..తెలంగాణలో మరో ప్రత్యామ్నాయ నాయకత్వంకు చోటివ్వకుండా ఎదిగిన లీడర్..ఆయనకు ఆయనే సాటి..ఆయనకు నిజంగానే లేరు పోటి. ఇప్పటిదాకా రెండు జాతీయ పార్టీలు సాధించలేనివి ఇకపై కూడా సాధించలేవు.
కనుక కేసీఆర్ అనే ఓ ధీరత్వంకు ఎదురులేదు.ఆయన స్థాయికి చేరుకునే నాయకుడు కూడా లేరు.ఆయనేం చెప్పినా ఆ మాండలిక సొబగు మరో నాయకుడి మాటలో ఉండదు ఆ తీరులో అస్సలు మనం చూడలేం కూడా! భాషపై పట్టు.. ప్రాంతీయ భాష నుడికారం పై పట్టు.. జాతీయ వాదం వినిపించిన చోట కూడా ప్రాంతీయ హక్కుల కోసం ఆరాటం ఇవన్నీ ఇవాళ కేసీఆర్ ను
మరో స్థాయికి చేర్చనున్నాయి. డియర్ సర్ ఆల్ ద బెస్ట్…
ఇవాళ తెలంగాణ చంద్రుడు సీఎం కేసీఆర్ పుట్టిన్రోజు..ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ రాస్తున్న మాటలివి. తెలంగాణ రాష్ట్ర సమితిని ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీ స్థాయికి చేర్చి తరువాత పరిణామాల నేపథ్యంలో ఆయన పరుగులు తీయించారు.ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఆయన కృషి చేశారు.ఆ కృషి ప్రజా సంఘాలు తోడయ్యాయి.ఇంకొన్ని సంఘటనలు కలిసి వచ్చాయి.అవన్నీ ఆయన స్థాయిని పెంచాయి.తద్వారా ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనకు చేయాల్సిన మంచి చేయకూడని చెడు అన్నీ అన్నీ ఆవేళ స్పష్టంగా వివరించి విజయవంతంగా తాను అనుకున్నది దక్కించుకున్నారు.ఆ వేళ కేంద్రంతో కొట్లాడారు.
సమైక్య పాలకులు మరియు పోలీసులతో ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు.ఆ వేళ ఆయన ఎన్నో సమస్యలను చవి చూసి తరువాత వాటిని అధిగమించారు.ఇదే సమయంలో పోలీసులు కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఇవన్నీ దాటి వచ్చాక ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు దాటిపోయింది. ఇప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు.ఆయన ఆ దిశగా సంకల్పించుకున్నారు.ఆయన సంకల్పంలో భాగంగా జాతీయ స్థాయిలో సొంతంగానే ఓ పార్టీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఆ క్రమంలో అనేక ప్రతిపాదనలు కూడా చేస్తున్నారు.దేశాన్ని నడిపే శక్తిగా ఆయన ఎదిగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అదేవిధంగా ప్రజా ఫ్రంట్ ఏర్పాటుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు.ముఖ్యంగా బీజేపీని సమర్థ రీతిలో ఎదుర్కొనేందుకు తనని తాను సిద్ధం చేసుకుంటూనే,తన వాళ్లకూ ఓ దిశా నిర్దేశం చేయడంలో ఇవాళ కేసీఆర్ దృష్టి సారించారు.
వారికి మరో మారు ఆల్ ద బెస్ట్…
– రత్నకిశోర్ శంభుమహంతి
శ్రీకాకుళం దారుల నుంచి