దేశవాళీ టోర్నీ అయిన రంజీ ట్రోఫీ నేటి నుంచి ప్రారంభం కానుంది. కరోనా వ్యాప్తి కారణంగా రెండు సంవత్సరాల పాటు నిలిచిపోయిన ఈ టోర్నీ.. మళ్లీ నిర్వహించడానికి రంగం సిద్ధం అయింది. ఈ సారి కూడా కరోనా వ్యాప్తి ఉండటంతో రెండు రౌండు లలో రంజీ ట్రోఫీని బీసీసీఐ నిర్వహిస్తుంది. మొదటి రౌండు మ్యాచులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కాగ కరోనా కారణంగా ప్రేక్షకులు లేకుండానే బీసీసీఐ రంజీ ట్రోఫీని నిర్వహిస్తుంది.
ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినా.. మ్యాచ్ ల నిర్వహాణకు బీసీసీఐ కఠిన నిబంధనలు పెడుతుంది. రంజీ ట్రోఫీ ఆడే ఆటగాళ్లుకు ప్రత్యేకమైన బయో బబుల్స్ ను ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా ఎనిమిది ప్రాంతాల్లో బయో బబుల్స్ ను బీసీసీఐ ఏర్పాటు చేసింది. కాగ ఈ రంజీ ట్రోఫీ లో డిఫెండిగ్ ఛాంపియన్స్ సౌరాష్ట్ర తో పాటు 41 సార్లు రంజీ ట్రోఫీ ఛాంపియన్ ముంబాయి జట్లు హాట్ ఫేవరట్ గా బరిలోకి దిగనున్నాయి.
కాగ ఈ రంజీ ట్రోఫీలో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు పుజారా, రహేనే తో పాటు ఇషాంత్ శర్మ కూడా బరిలోకి దిగనున్నారు. కాగ ఇటీవల టెస్టు మ్యాచ్ లలో వీరు దారుణంగా విఫలం అవుతున్నారు. ఈ రంజీ ట్రోఫీలో రాణించి.. త్వరలోనే జరగబోయే శ్రీలంక టెస్టు సిరీస్ కు సిద్ధం కావాలని చూస్తున్నారు.