డైలాగ్ ఆఫ్ ద డే : జేజేలు స‌మ్మ‌క్కా జేజేలు సారక్కా

-

అమ్మ‌ను త‌లిచేను ధైర్యం వ‌చ‌నం అయింది
అమ్మ‌ల‌ను కొలిచేను ఆహా జీవితం సుసంప‌న్న‌త‌కు సార్థ‌క‌త వెతికింది
అడివిలో న‌డిస్తే జీవితం ఓ నినాదం అయింది ఉద్య‌మం ఒక ప్రాకారం అయింది
త‌ల్లి అందించే దీవెన.. ప్రపంచాన్ని జ‌యించేందుకు ఓ కార‌కం
అమ్మా నీవెక్క‌డ వస్తున్నాను నీ చెంత‌కే!
అడ‌వి మ‌ల్లెల ప‌రిమ‌ళాల చెంత ఆ త‌ల్లే అమృత ధార‌లు అందించి వెళ్లారు
ప‌సిత‌నం నాలో.. అప్ప‌టికీ ఇప్ప‌టికీ త‌ల్లులారా మీకు వంద‌నం..

అడ‌వి త‌ల్లులు, వీర క‌థ‌ల‌కు వార‌థులు స‌మ్మ‌క్క సారక్క‌ల‌ను ఉద్దేశించి జియ‌ర్ స్వామి చేసిన వ్యాఖ్య‌లు పెను దుమారం రేపుతున్నాయి. ఎప్పుడో చేసిన వ్యాఖ్యాలే ఇవి అయినా ఇప్పుడు అవి వైర‌ల్ అవుతున్నాయి.దీనిపై తెలంగాణలో పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది.అడ‌వి త‌ల్ల‌ల‌ను వారి స్థాయిని త‌గ్గించి మేడారం జాత‌ర స్థాయిని త‌క్కువ చేసి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు వివాదాల‌కు తావిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇవాళ్టి డైలాగ్ ఆఫ్ ద డే.

వ‌నల్లా తిరిగే దేవ‌త‌లు సాహ‌స గుణానికి ప్ర‌తీక‌లు.గుడి లేదు విగ్ర‌హం లేదు త‌ల్లి దీవెన‌లే ప్రామాణికాలు. అమ్మలు మ‌న ఇంటి కొమ్మ‌లు మ‌న ఇంటి దేవ‌తలు.. ఆ త‌ల్లుల దీవెన‌ల కోసం మేడారం వ‌స్తారు. త‌ల్లి నీడన ఉంటారు.త‌ల్లికి జేజేలు ప‌లికి మ‌రో మారు వ‌చ్చే అవ‌కాశం ఇవ్వ‌మ‌ని వేడుకుంటారు. బంగారు ర‌థాలు లేవు. ప‌ల్లకీలు లేవు. ఓ మామూలు జీవితం ఆ త‌ల్లుల‌ది..దీవెన‌లు అందిస్తే చాలు ఇంకేమీ వ‌ద్దు అనుకునే సామాన్య జ‌నం ద‌గ్గ‌ర మ‌నం అంతా ఎంత? ఈ స్వాములంతా ఎంత‌? ఈ రాజ‌కీయ నాయ‌కులంతా ఎంత‌?

అంతెత్తు విగ్ర‌హ‌మా ఓ స‌మతామూర్తీ నీవు ఇదే కోరుకున్నావా అని ముచ్చింత‌ల్ విగ్ర‌హం చూసి ఆశ్చ‌ర్య‌పోయారు కొంద‌రు. వెయ్యి కోట్ల ఆల‌యం ద‌గ్గ‌ర మా త‌ల్లులు చిన్న‌బోయారా అయ్యో! వాటికి మించిన ప్రాభ‌వం ఈ అడ‌వి త‌ల్లుల‌ది..బిడ్డ‌ల‌కు నిండుగా ధైర్యం ఇచ్చే త‌ల్లులే గొప్ప‌వారు. ఆ మాట‌కు వ‌స్తే విశిష్టాద్వైత రూప క‌ర్త కూడా గొప్ప వారు. శ్రీ‌రామానుజా చార్యులు ఇంత‌టి హంగామా కోరుకున్నారా లేదా ఇవాళ్టి వివాదం ను కోరుకున్నారా? స‌మ్మ‌క్క సార‌క్క ఈ త‌ల్లుల పేరిట ఏం బిజినెస్ జ‌రుగుతోంది.. ప‌ర‌బ్ర‌హ్మ త‌త్వం నాలోనే ఉంది.. మీతోనూ ఉంది.. ప్ర‌త్యేకించి దేవుళ్ల‌కు మీరు ఆపాదిస్తున్నారు.

మేం కొలిచినంత మేం మొక్కినంత ఆ త‌ల్లి మాకు వరాలు ఇస్తూనే ఉంటుంది. మ‌మ్మ‌ల్ని మేం ఎక్కువ చేసుకోం కానీ మీ క‌న్నా మేం ఎక్కువే అని ఇవాళ చెబుతాం.. రాజ‌కీయాల నీడ‌లు వ‌ద్దు మాకు..మాకు మా త‌ల్లే ముఖ్యం.. జేజేలు సమ‌క్కా జేజేలు సారక్కా…అడ‌వికి ధైర్యం ఊరికి న‌మ్మ‌కం జీవితానికో భ‌రోసా రేప‌టి త‌ల్లుల‌కో స్ఫూర్తి నా త‌ల్లులు వీళ్లు..వంద‌నాలు చెల్లిస్తున్నాను నేను.

– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి
శ్రీ‌కాకుళం దారుల నుంచి…

Read more RELATED
Recommended to you

Latest news