బిజెపికి 8 ఏళ్ల తర్వాత విమోచన దినం ఎందుకు గుర్తుకు వచ్చింది? అంటూ ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. మునుగోడు ఎన్నికల్లో లబ్ది కోసమే బిజెపి తెలంగాణ విమోచన దినం నిర్వహిస్తోందన్నారు. బిజెపి, టిఆర్ఎస్ మధ్య సంబంధాలు బాగున్నప్పుడు విమోచన దినాలు నిర్వహించాలనిపించలేదా? అంటూ మండిపడ్డారు. బిజెపికి చిత్తశుద్ధి ఉంటే టిఆర్ఎస్ అవినీతి అక్రమాలు బయటపెట్టి వాళ్లను జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు.
ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్క హామీనైనా బిజెపి నెరవేర్చిందా అంటూ దుయ్యబట్టారు. బిజెపి, టిఆర్ఎస్ ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ డ్రామాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17న బిజెపి అమాయక ప్రజలను మోసం చేసేందుకు కొత్త డ్రామాకు తెర లేపుతోంది అన్నారు. అన్ని రంగాలలో ధరలను పెంచడం తప్ప నరేంద్ర మోడీ ఒక్క మంచి పని చేయలేదని అన్నారు వీ హనుమంతరావు.