ఆ విషయంలో చిరంజీవి, అశ్వనీదత్‌లకు రుణపడి ఉంటా.. దర్శకుడు రాఘవేంద్రరావు

-

టాలీవుడ్ సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఇన్నాళ్లు దర్శకుడిగా ఉన్నారు. ఇటీవల నటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ప్రస్తుతం పలు సినిమాలకు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తుండటంతో పాటు నటుడిగానూ పని చేస్తు్న్నారు. కాగా, దర్శకేంద్రుడు ఓ విషయంలో తాను మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ భారీ నిర్మాత అశ్వనీదత్ లకు రుణపడి ఉంటానని చెప్పారు. ఆ విషయమేమిటో తెలుసుకుందాం.

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు-చిరంజీవి-అశ్వనీదత్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. ఈ చిత్రం చిన్న పిల్లల నుంచి మొదలుకుని వృద్ధుల వరకు ప్రతీ ఒక్కరికి నచ్చుతుంది. ఇప్పటికీ ఈ పిక్చర్ టీవీల్లో వస్తే చాలు.. జనాలు అలా చూస్తుంటారు. ఇంతటి గొప్ప సినిమా ఇచ్చిన దర్శకుడికి థాంక్స్ చెప్తుంటారు. కాగా, ఈ సినిమా మేకింగ్ చిరంజీవి, అశ్వనీదత్ వల్లే జరిగిందని రాఘవేంద్రరావు చెప్పారు.

తాను ఈ సినిమా తీయడాని కంటే ముందు తీసిన మూడు చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయని, అయినప్పటికీ చిరంజీవి-అశ్వనీదత్ తనకు దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు రాఘవేంద్రరావు. ఓ ఇంటర్వ్యూలో వారిరువురికి రాఘవేంద్రరావు థాంక్స్ చెప్పారు. శ్రీదేవి, చిరంజీవి జంటగా నటించిన ఈ చిత్రానికి ఇళయరాజా మ్యూజిక్ అందించారు.

ఈ సినిమా భారీ వసూళ్లు చేసి సూపర్ హిట్ అయింది. చిత్ర విడుదల రోజున తుఫాన్ వచ్చినప్పటికీ జనాలు థియేటర్ వద్దకు వచ్చి సినిమా చూసి విశేషంగా ఆదరించారు. చిరంజీవి కెరీర్ లోనే సెన్సేషనల్ హిట్ గా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ పిక్చర్ నిలిచింది.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news