ఆ స్టార్ హీరో, విలన్ వివాహం కోసం అంత పని చేశారా..?

-

సాధారణంగా హీరోలకు అభిమానులు ఉంటారు అనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కొంతమంది హీరోలకు మాత్రం లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటారు. అప్పట్లో అలాంటి క్రెడిట్ జగపతిబాబు వంటి వారు కూడా సంపాదించారు .. ఫ్యామిలీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న ఈ నటుడు కెరియర్ పరంగా ఎన్నో ఎదురు దెబ్బలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత వరుస విజయాలతో స్టార్ హీరో రేంజ్లో దూసుకుపోయాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆర్థిక పరిస్థితుల కారణంగా వెనుకబడి పోయాడు అని చెప్పవచ్చు.Jagapathi Babu Family, Biography, Wife, Movies, Career, Wiki & More

ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం జగపతి బాబు లెజెండ్ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఆ తరువాత ఆయనకు తిరుగులేని స్టార్డమ్ ను తెచ్చిపెట్టాయి అని చెప్పవచ్చు. ఇక అప్పటి నుంచి ఎన్నో పాత్రలు విలన్ గా చేస్తూ తన కెరీర్ ని ముందుకు సాగిస్తున్నాడు. ఇక జగపతి బాబు భార్య లక్ష్మీ కూడా ఆయనకు చాలా ధైర్యాన్ని చెబుతూ ఉండేదట. అప్పట్లో జగపతిబాబుకి కొన్ని ఎఫైర్స్ ఉన్నాయి అంటూ మీడియాలో బాగా వార్తలు వినిపించాయి. ఆ సమయంలో కూడా లక్ష్మీ బాధపడకుండా ధైర్యంగా ఉంది. అలా అని ఏనాడు జగపతి బాబు ను ఒక ప్రశ్న కూడా వేయలేదట.Jagapathi Babu Family Members with Wife, Daughters, Father, Mother & Biography - YouTube

జగపతిబాబుకు కేవలం మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇంటిదగ్గర భార్య ఉందనే విషయాన్ని మరిచిపోవద్దనే మాట ఒకటే చెబుతూ ఉండేదట. ఇక జగపతి బాబు తన భార్య లక్ష్మి ప్రేమ వ్యవహారం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. జగపతిబాబు డిగ్రీ అయిపోయిన వెంటనే వైజాగ్ లో తన ఫర్నిచర్ ఫ్యాక్టరీని చూసుకోవడానికి వెళ్లారు. ఇక లక్ష్మి కూడా జగపతి బాబు కుటుంబానికి దగ్గర బంధువే.. కానీ తమ బంధువుల ఇంట్లో జగపతిబాబు మీద మంచి అభిప్రాయం లేకపోవడం వల్లే వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదట. అలా ఒకసారి ఫ్యాక్టరీ గోడ పైనుంచి కింద పడడంతో జగపతిబాబుకు గాయాలు తగలడంతో హాస్పిటల్ కి చేర్చారు. కానీ వీరి కుటుంబ సభ్యులు మాత్రం వివాహానికి ఒప్పుకోలేదు అందుకే ఆత్మహత్య ప్రయత్నం చేశారని అందరూ అనుకున్నారు. అందుచేతనే జగపతి బాబు , లక్ష్మి వివాహాన్ని వెంటవెంటనే జరిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news