మైదాపిండి అనేక ఆరోగ్య సమస్యలకు కారణమని మీకు తెలుసా..? అసలు ఇందులో..

-

మైదాపిండి చూడ్డానికి భలే తెల్లగా సాఫ్ట్ గా ఉంటుంది కదూ. ఆ పిండితో చేసిన వంటలు కూడా టేస్టీగానే ఉంటాయి. ముఖ్యంగా మైసూర్ బోండాలు. మైదాతో వంటను ఫాస్ట్ గా కూడా చేసేయొచ్చు. ఇలా మనం ఇళ్లల్లో కాస్త తక్కువగా వాడినా హోటళ్లలో అయితే బ్రెడ్, పిజ్జా, పాస్తా, కేక్స్, కుకీస్, మఫ్పిన్స్, డోనట్స్, న్యూడుల్స్, బర్గర్స్… వీటి తయారీలో మైదా కలుపుతారు. కానీ మీకు తెలుసా అసలు మైదా పిండి ఆరోగ్యానికి ఎంత హానికరమో.

గోధుమ పిండి వ్యర్థాల్లో ప్రమాదకర రసాయనాలు కలిపి రిఫైన్డ్ చేయడం ద్వారా… మైదాపిండి తయారవుతుందట. ఇందులో పోషకాలు, ఫైబర్, విటమిన్లు అససు ఏవీ ఉండవు. బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయి. తద్వారా ఎన్నో అనారోగ్య సమస్యులు చుట్టుముడతాయి. ఈరోజు మనం మైదా తినటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.

షుగర్ లెవెల్స్ పెరుగుదల : మైదా తింటూ ఉంటే క్రమంగా టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందట.. మైదాలో షుగర్ లెవెల్స్ పెంచే గుణాలు చాలా ఎక్కువ. మైదా వంటలు తింటే… ఒక్కసారిగా ఇన్సులిన్, షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఒక్కసారి డయాబెటిస్ వస్తే ఇక పోదు. దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఆ ఇబ్బంది పడకూడదంటే మైదాను దూరం చేయటమే ఉత్తమం.

బరువు పెరుగుదల : మైసూర్ బోండాం లేదా మైసూర్ బజ్జీ లాంటి వాటిని మైదాతోనే చేస్తారు. ఈ విషయం మనకు తెలిసిందే. అలాంటి వాటిని రెగ్యులర్‌గా తింటే ఆటోమేటిక్‌గా బరువు పెరుగుతారు. బాడీలో కొవ్వు పేరుకుపోతుంది. ఊబకాయం వచ్చేస్తుంది.

జంక్ ఫుడ్డ్ : మైదాను జంక్ ఫుడ్ అనుకోవచ్చు. జంక్ ఫుడ్స్ కూడా అంతే..టేస్టీగా ఉంటాయి కానీ ఆరోగ్యానికి అస్సలు మంచివికావు..మైదా కూడా అంటే నోటికి రుచిగా ఉంటుంది కానీ… ఆరోగ్యాన్ని చెడగొట్టి లేనిపోని అనారోగ్యసమస్యలను తెస్తుంది.

చెడు కొలెస్ట్రాల్ పెరుగుదల : మైదాలో చెడు కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంటుంది..మనం తినేకొద్ది అది బాడీలో పెరిగే అడ్డమైన రోగాలు వచ్చేలా చేస్తుంది.

acidity-problem

యాసీడీటీ : తరచూ మైదా పదార్థాలు తింటూ ఉంటే పొట్టలో బరువుగా, ఏదో రాయిని మోస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. తిన్న ఆహారం అరగదు. జీర్ణం కాదు. గ్యాస్ తయారపవుతుంది. త్రేన్పులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ సమస్యలే. దీన్నే యాసీడీటీ అంటారు. మలబద్ధకం కూడా వేధిస్తూ ఉంటుంది.

హైబీపీ సమస్య : బరువు పెరగడం, ఇన్సులిన్ నిరోధకత, వేడి ఈ లక్షణాలు అన్నీ ఇక హైబీపీ కూడా వచ్చేలా చేస్తాయి. అందుకే మైదాతో చేసిన పదార్థాలు ఎక్కువ తినకూడదు. అసలు తినకుంటే మరీ మంచిది

గుండె, బ్రెయిన్, చర్మం, కళ్లు, ఇతర శరీర అవయవాల్ని మైదావల్ల ఎఫెక్ట్ అవుతాయి. ఇది మనశరీరానికి స్లోపాయిజన్ లా పనిచేస్తుంది. కాబట్టి మీరు కానీ మీ ఆత్మీయుల్లో ఎ‌వరైనా ఇలా మైదాతో చేసే పదార్థాలను అదేపనిగా లాగిస్తుంటుంటే కాస్త చెప్పండి వాళ్లకి..ఇన్ని సమస్యలు ఉన్నాయని.

Read more RELATED
Recommended to you

Exit mobile version