మనం తీసుకునే ఆహారం బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అందుకని మంచి ఆహారాన్ని డైట్ లో చేర్చుకుంటూ ఉండాలి. విటమిన్స్ మినరల్స్ మొదలైన అన్ని పోషక పదార్థాలు మనం డైట్ లో తీసుకుంటూ ఉండాలి. చాలా మంది తెలియక చేసే తప్పుల వలన ఆరోగ్యం దెబ్బతినే అవకాశం వుంది. కనుక తప్పనిసరిగా ఈ విషయాలను చూసి పాటించండి.
పండ్లు కూరగాయలు మొదలైన వాటిని కూడా ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. మనం ఒక్కొక్క ఆహార పదార్థాన్ని ఒక్కో విధంగా తీసుకుంటూ ఉంటాము. ఉడికించి తీసుకోవడం, వేయించి తీసుకోవడం కొన్ని సార్లు పచ్చిగా తీసుకోవడం వంటివి చేస్తూ ఉంటాము. పచ్చి కూరగాయలు తినడం వలన విటమిన్ కంటెంట్ మనకి ఎక్కువగా ఉంటుంది. వేడి తగలదు కాబట్టి పోషకాలు అలానే ఉండిపోతాయి.
కానీ పచ్చి కూరగాయలు తినడం వలన జీర్ణ సమస్యలు కలిగే అవకాశం ఉంది. క్యాబేజీ, బ్రోకలీ, కాలీఫ్లవర్ వంటివి పోషక పదార్థాలతో నిండినప్పటికి గ్యాస్, ఉబ్బరం సమస్యలు వస్తాయి. కొన్ని ఆహార పదార్థాలు వండినప్పుడే వాటి యొక్క పోషోర్ పదార్థాలు మనకి అందుతాయట. క్యారెట్లు వండి తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది. పాలకూర, పుట్టగొడుగులు, బంగాళదుంపలు, గ్రీన్ బీన్స్ వంటి కూరగాయలని వండి తీసుకుంటేనే మంచిది. పచ్చిగా తీసుకుంటే పోషక పదార్థాలు అందవు. కానీ ఉల్లిపాయలు, వెల్లుల్లి, బ్రోకలీ, బెల్ పెప్పర్స్ వంటివి పచ్చిగా తీసుకుంటేనే ఎక్కువ లాభాలను మనం పొందొచ్చు. కాబట్టి ఈ ముఖ్యమైన విషయాలని డైట్ లో పాటిస్తే పోషక పదార్థాలు మీకు బాగా అందుతాయి.