పెట్రోల్, డీజిల్ ధరలు అలానే వున్నాయి. వీటి ధరలు ఏమి పెరగలేదు. గత కొన్ని రోజుల క్రితం జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరుగుదలకు బ్రేక్ పడింది అని చెప్పవచ్చు. ఇక వీటికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..
మనం ఈ ధరలు స్థిరంగా ఉండక ముందు నుండి చూసినట్లయితే ఇంధన ధరలు పెరుగుతూ వచ్చాయి. కానీ ఏది ఏమైనా గురువారం కి బ్రేక్ పడింది అనే చెప్పచ్చు. దీనితో వాహనదారులకు కాస్త రిలీఫ్ అనే చెప్పాలి. ఇక ఎక్కడెక్కడ ధరలు ఎలా వున్నాయి అనేది చూస్తే..
న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 92.85 గా ఉండగా.. డీజిల్ రూ. 83.51 వద్ద కొనసాగుతోంది. అదే చెన్నై లో అయితే గురువారం లీటర్ పెట్రోల్ ధర రూ. 94.54 గాఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే బుధవారంతో పోలిస్తే స్వల్పంగా తగ్గి రూ. 88.34 వద్ద కొన సాగుతోంది.
ఇక ముంబయి లో అయితే లీటర్ పెట్రోల్ ధర రూ. 99.14 ఉంటే డీజిల్ రూ. 90.71 వుంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.94 ఉండగా.. డీజిల్ రూ. 88.53 వద్ద కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు చూస్తే.. హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 96.50 , డీజిల్ రూ. 91.04 గా ఉంది. విజయవాడలోనూ ధరలు తగ్గాయి ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ. 98.97 వద్ద కొనసాగుతుండగా.. డీజిల్ ధర రూ. 92.95 గా ఉంది. ఇక విశాఖ లో అయితే పెట్రోల్ ధర రూ. 98.07 గా ఉండగా.. డీజిల్ ధర రూ. 92.06 గా ఉంది.