ఏపీలో అరెస్టుల పర్వం తీవ్ర రూపం దాల్చుతోంది. మరీ ముఖ్యంగా టీడీపీ నేతనలు పోలీసులు అరెస్టు చేయడం రాజకీయ రణరంగం సృష్టిస్తోంది. ఈ అరెస్టులపై గత కొద్ది రోజులుగా గట్టిగా కౌంటర్ ఇస్తున్న నారా లోకేష్ ఈ రోజు మరో అడుగు ముందుకు వేశారు. ఏకంగా ఎస్పీని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు తిట్టారు. కానీ డైరెక్ట్ గా కాదండి.. ట్విట్టర్ లో.
ఎస్పీ అమ్మిరెడ్డి నీకు సిగ్గుందా? వైసీపీకి గులాంగిరీ చేస్తున్నారా.. వైసీపీ నేతల అరాచకాలపై వీడియోలు పెట్టిన టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారు. మరి వైసీపీ వాళ్లు టీడీపీ నేతలపై వీడియోలు పెడితే ఏం చేశారు.
వైసీపీ కార్యకర్తలను ఎంతమందిని అరెస్టు చేశారు అంటూ మండిపడ్డారు. జగన్ దగ్గర పనిచేయాలని మీకు అంత కులపిచ్చి ఉంటే పోలీస్ డ్రెస్ తీసేయండి అంటూ ఘాటుగా విమర్శించారు. ఓ ఎస్పీని పట్టుకుని ఈ స్థాయిలో విమర్శలు చేయడం ఇదే మొదటిసారి. ఎస్పీ అంటే జిల్లాకు బాస్. మరి ఆయనపై లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలకు ఎస్పీ, వైసీపీ ఎలా స్పందిస్తారో చూడాలి.