హరీశ్ శంకర్ కొత్త వెబ్ సిరీస్ చూడాలని ఉందా..!!

-

హరీశ్ శంకర్ తెలుగు లో చేసింది కొన్ని సినిమాలే అయినా ఎప్పుడూ మీడియాలో హాట్ టాపిక్ గా ఉంటూ ఉంటారు. తాను పవన్ కల్యాణ్ తో తీసిన గబ్బర్ సింగ్ తమను మరింత పాపులర్ చేసింది. మళ్లీ ఎప్పుడు పవన్ తో సినిమా అన్న ప్రశ్నలకు రీసెంట్ గా సమాధానం వచ్చిన సంగతి తెలిసిందే. హరీశ్ శంకర్ ముందు అనుకున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ వదిలి, తమిళ సినిమా అయిన తెరి ను రీమేక్ కోసం స్క్రిప్ట్ రెడీ  చేస్తున్నాడు.

ఇప్పుడు ఆ సినిమా పేరు లో తాను పవన్ కోసం ఇష్టంగా పెట్టుకున్న భగత్ సింగ్ ఉంచుతూ ముందు ఉస్తాద్ భగత్ సింగ్ గా పవర్ ఫుల్ పేరు పెట్టి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు. ఇక తాను గతంలో ఒక ఓ టి టి కు వెబ్ సిరీస్ కు పనిచేశాడు. దాని పేరు “ఎటిఎం”.  ఈ వెబ్ సిరీ స్ ప్రముఖ సంస్థ అయిన జీ 5 ద్వారా విడుదలకు సిద్దంగా ఉంది.

తాజాగా ఈ వెబ్ సిరీస్ కు రిలీజ్ డేట్ ఖరారు చేసారు. మరి ఈ ఏ టి ఎం  సిరీస్ అయితే తెలుగు సహా తమిళ్ లో ఈ జనవరి 20 నుంచి అందుబాటులో ఉండనున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ సిరీ స్లో బిగ్ బాస్ ఫేమ్ సన్నీ అలాగే ఇతర స్టార్ నటులు సుబ్బరాజు తదితరులు ఇందులో నటించారు. అలాగే ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించాడు. అలాగే హర్షిత్ మరియు హర్షిత లు మరియు దిల్ రాజు నిర్మించారు.

Read more RELATED
Recommended to you

Latest news