పవన్ – పోసాని… మధ్యలో పంజాబీ హీరోయిన్.. ఎవరంటే…!

-

“రిపబ్లిక్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మైకందుకుని.. రాజకీయ ప్రసంగం చేసిన పవన్ పై వరుసపెట్టి దాడిచేస్తున్నారు వైకాపా నేతలు – జగన్ సానుభూతిపరులు. ఇదే సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా.. ఛాంబర్ కు పవన్ మాటలకూ ఏమీ సంబందం లేదని చెప్పేసింది. అది పూర్తిగా పవన్ వ్యక్తిగత విషయం అని క్లారిటీ ఇచ్చేసింది. ఫలితంగా పవన్ ఒంటరైపోయారు. ఈ గ్యాప్ లో మైకులముందుకు వచ్చారు పోసాని. వచ్చీ రాగానే పంజాబ్ హీరోయిన్ వ్యవహారం బయటకు తీశారు!

అవును… వైసీపీకి సానుభూతిపరుడిగా, జగన్ కు విధేయుడిగా వ్యవహరించే పోసాని కృష్ణమురళి… పవన్ – ఏపీసర్కార్ వివాదంలోకి ఓ పంజాబీ హీరోయిన్ ను లాక్కొచ్చారు. ఓ “పవర్ ఫుల్ వ్యక్తి”, సినిమా అవకాశాలు ఇప్పిస్తానని సదరు పంజాబీ అమ్మాయిని లొంగదీసుకున్నాడని.. గర్భవతిని చేశాడని.. అనంతరం ఆ హీరోయిన్ తల్లిదండ్రులకు 5 కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ల నోరు మూయించాడని.. ఆ హీరోయిన్ కు అబార్షన్ చేసి ఆమెను ఒక మానసిక రోగిగా మార్చేశాడని పోసాని ఆరోపించారు.

అక్కడితో ఆగని పోసాని… అమ్మాయిలంటే అమితమైన గౌరవం ఉన్న పవన్ కల్యాణ్.. ఈ ఇష్యూను తలకెత్తుకోవాలని.. ఆ అమ్మాయికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అమ్మాయి కాబట్టి పేరు బగ్యటకు చెప్పనని.. ఆమె పేరు పవన్ చెవిలో మాత్రమే చెబుతానని అన్నారు. అవసరమైతే ఆ అంశంపై సీబీఐ విచారణకు ఆదేశించి, హీరోయిన్ కు న్యాయం చేస్తే, తన వంతుగా పవన్ కు గుడి కట్టి పూజిస్తానని అన్నారు పోసాని. దీంతో… ఆ “పవర్” ఫుల్ హీరో ఎవరు.. ఆ “పంజాబీ హీరోయిన్” ఎవరు అనే చర్చ ఆన్ లైన్ వేదికగా మొదలైపోయింది.

నిజానికి పోసాని అన్నది ఎవరినో దాదాపుగా ఇండస్ట్రీలో అందరికీ తెలుసు! గతంలో సోషల్ మీడియాలో ఈ వివాదంపై చాలా రచ్చ నడిచింది. వీడియో టేపులు కూడా ఉన్నాయనే ప్రచారం కూడా సాగింది. మరోవైపు ఆ హీరోయిన్ కూడా పరోక్షంగా.. ఆ బడా హీరోపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేసిన సంగతి కూడా చాలామందికి గుర్తుండే ఉంటుంది.

కాస్టింగ్ కౌచ్ రచ్చ ఓ ఊపు ఊపేస్తున్న సమయంలో.. పోసాని చెప్పిన ఈ “పవర్” ఫుల్ హీరోపై ఆ హీరోయిన్ పరోక్షంగా చాలా కామెంట్స్ చేసింది. “భగవంతుడు ఎప్పటికైనా వాళ్లను శిక్షిస్తాడు” అనే రీతిలో పోస్టులు పెట్టింది.. శాపనార్థాలు పెట్టింది! ఈ టోటల్ ఎపిసోడ్ లో ఓ “స్టార్ డైరక్టర్” పేరు కూడా గతంలో ప్రముఖంగా వినిపించిన సంగతి కూడా తెలిసిందే!

Read more RELATED
Recommended to you

Latest news