తెలుగు భాషపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కీలక వ్యాఖ్యలు

-

నార్సింగి ఓం కన్వెన్షన్ లో తెలుగు సంగమం – సంక్రాంతి సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, పద్మశ్రీ శోభరాజు, ఆకెళ్ల విభీషన శర్మ, బీజేపీ నేత మురళీధర్ రావు ఈ సందర్భంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. అన్నగారు ఎన్టీఆర్ మేజర్ చంద్రకాంత్ సినిమా షూటింగ్ సమయంలో ఆయనతో ఓ మాట అడిగానని.. తెలుగు భాషని అన్ని స్కూల్స్ లో తప్పనిసరిగా నేర్పించాలని అన్నగారు ఎన్టీఆర్ ని కోరానని తెలిపారు.

నేను తీసిన ఓ సినిమాలో హీరో తెలుగుని ఉద్యమంగా తీసుకుంటాడని.. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదని తెలిపారు. హీరో స్కూల్ లో తెలుగు గురించి టీచర్స్ ని అడుగుతాడని.. ఈ చిత్రంలో ఆ సీన్ ప్రత్యేకంగా ఉంటుందన్నారు. రాజమౌళి, కీరవాణి ఇండియన్ స్టార్స్ అయ్యారని.. వీరి పిల్లలు స్కూల్ కాలేజీలో ఇంగ్లీష్ మాట్లాడినా.. ఇంట్లో తెలుగులోనే మాట్లాడుతారని అన్నారు. ఏ రాష్ట్రంలో ఆ వ్యక్తులు వారి మాతృ భాష మాట్లాడించేలాగ చేయాలనీ కోరుతున్నానన్నారు రాఘవేంద్రరావు. ఇక్కడున్న పెద్దలు మాతృ భాష అంశంపై ప్రభుత్వంతో మాట్లాడి చొరవ తీసుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news