KGF2 టీమ్‌కు డైరెక్టర్ శంకర్ హ్యాట్సాఫ్..ప్రశాంత్ నీల్ రియాక్షన్ ఇదే

-

శాండల్ వుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ – రాకింగ్ స్టార్ యశ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సీక్వెల్ ఫిల్మ్ KGF చాప్టర్ 2. గత నెల 14న విడుదలైన ఈ పిక్చర్ ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతోంది. సాధారణ జనంతో పాటు సినీ ప్రముఖులు ఇప్పటికే ఈ సినిమా టీమ్ ను అభినందించారు. తాజాగా ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్..ఈ మూవీ చూశారు.

చిత్రం చూసిన తర్వాత తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు శంకర్. తాను ఫైనల్ గా KGF2 ఫిల్మ్ చూశానని, స్టోరి, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, యాక్షన్, డైలాగ్స్ బ్యూటిఫుల్ గా ఉన్నాయని, హీరో యశ్..పవర్ హౌజ్ అని పేర్కొన్నారు శంకర్. యాక్షన్ డైరెక్టర్స్ అన్బిఅరివులతో పాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్, మూవీ యూనిట్ సభ్యులందరినీ అభినందిస్తూ వారికి హ్యాట్సాఫ్ చెప్తున్నట్లు ట్వీట్ చేశారు శంకర్.

తమకు చక్కటి సినిమాటిక్ ఎక్స్ పీరియెన్స్ ను అందించారని తెలిపాడు. శంకర్ ప్రస్తుతం RC 15 పిక్చర్ డైరెక్ట్ చేస్తు్న్నారు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో కాగా, హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుండగా, ఈ మూవీకి స్టోరిని కార్తీక్ సుబ్బరాజ్ అందించారు.

శంకర్ ట్వీట్ చూసి ప్రశాంత్ నీల్ స్పందించారు. సినిమా మేకింగ్ లో స్వయంగా మాస్టర్ అయిన శంకర్ సర్ నుంచి కాంప్లిమెంట్ రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు ప్రశాంత్ నీల్. తనకు ఇది స్పెషల్ మూమెంట్ అని పేర్కొంటూ రీ ట్వీట్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news