టాలీవుడ్ దర్శకుడు సురేందర్ రెడ్డికి గాయం..ఫోటో వైరల్

-

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో దారుణం చోటు చేసుకుంది. దర్శకుడు సురేందర్ రెడ్డి కాలికి గాయం అయింది. అఖిల్ అక్కినేని నటిస్తున్న సినిమా ‘ఏజెంట్’ షూటింగ్ అవుతుండగా ఒక రాడ్ దర్శకుడు సురేందర్ రెడ్డి కాలు మీద పడి ఎడమ కాలుకి గాయమైందని చిత్ర యూనిట్ తెలిపింది.

ఆయనని వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించినట్టుగా తెలిసింది. ఏజెంట్ సినిమా మొదలుపెట్టి చాలా కాలం అయ్యి, ఇప్పుడిప్పుడే చివరి దశలో ఉంది అని కూడా తెలిసింది. అయితే ఈరోజు శనివారం షూటింగ్ సమయంలో సురేందర్ రెడ్డి కెమెరా ముందు నుండి సూచన ఇవ్వడానికి లేచి ముందుకు వెళ్లడంతో, అక్కడే ఉన్న ఒక రాడ్ సురేందర్ రెడ్డి కాలు మీద పడిందని తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news