వకీల్ సాబ్ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చేసిన దర్శకుడు వేణు..

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమాకు సీక్వెల్ రాబోతుందంటే వార్తలు చాలా రోజుల నుంచి వినిపిస్తున్న ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు చిత్ర బృందం. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి కు సీక్వెల్ ఉంటుందని ప్రకటించేశారు.

రాజకీయ కారణాలతో చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ బాలీవుడ్​ లో సూపర్​ హిట్​గా నిలిచిన ‘పింక్​’ తెలుగు రీమేక్​ ‘వకీల్ సాబ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలకు ముందు నుంచే అందరి దృష్టినీ ఆకర్షించింది. లాయర్​ పాత్రలో పవన్​ రీఎంట్రీ అభిమానులను ఎంతగానో ఉత్సాహపరిచింది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇందులో శృతిహాసన్, నివేదా థామస్, అంజలి, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్​ ముందు మంచి వసూళ్లను అందుకుంది. ముఖ్యంగా ఓటీటీలోనూ విశేష ఆదరణను దక్కించుకుంది. రికార్డు స్థాయిలో వ్యూస్​ను దక్కించుకుంది. బుల్లితెరపైనా సత్తాను చాటింది. కాగా ఈ సినిమాకు సీక్వెల్ ఉండబోతుందంటూ దర్శకుడు వేణు ప్రకటించి పవన్ అభిమానులకు మంచి జోష్ ఇచ్చారు.

Vakeel Saab Movie Download Filmywap, Tamilrockers Leaked 720p HD

2001 ఏప్రిల్ 9న విడుదలైన వకీల్ సాబ్ సినిమా తాజాగా రెండేళ్లు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా నెటిజన్లతో సోషల్​మీడియా వేదికగా ముచ్చటించిన డైరెక్టర్ వేణు ‘వకీల్ సాబ్’ మూవీ సీక్వెల్‌ గురించి మాట్లాడారు. ప్రస్తుతం సినిమాకు కథను రెడీ చేస్తున్నట్టు తెలిపారు అంతేకాకుండా.. “గతంలో నేను ప్రకటించిన సినిమా నిలిచిపోయింది. ప్రస్తుతం నేను మూడు స్క్రిప్టులకు పని చేస్తున్నాను. అందులో వకీల్ సాబ్ సీక్వెల్ కూడా ఉంది. కచ్చితంగా సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ కన్నా హెల్త్ గా ఉంటుందని ఇందులో పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ హై రేంజ్ లో ఉంటాయని, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలతో రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారని కొన్ని రోజులు అయితే ఆయనతో ఈ విషయంపై మాట్లాడతా..” అంటూ తెలిపారు..

Read more RELATED
Recommended to you

Latest news