తెలంగాణలో నేడు బృహత్తర కార్యక్రమం.. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ

-

హైదరాబాద్: తెలంగాణ నేడు బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పేదలకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనుంది. మొత్తం 3 లక్షల 80 వేల మంది ఈ కార్డులను అందజేయనున్నారు. ఈ కార్యర్రమాన్ని మంత్రి గంగుల కమలాకర్ జయశంకర్ జిల్లా భూపాలపల్లి జిల్లాలో ప్రారంభించనున్నారు. మిగిలిన ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. కొత్త రేషన్ కార్డు పొందిన వారికి ఆగస్టు నుంచి పీడీఎస్ బియ్యం పంపిణీ చేయనున్నారు.

ration-cards
ration-cards

తాజాగా జారీ చేస్తున్న కార్డులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌కార్డు దారుల సంఖ్య 90 లక్షల 50 వేలకి చేరనుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్‌ సరుకులు పంపిణీ చేసేందుకు నెలకు మొత్తం రూ. 231 కోట్ల చొప్పున ఏడాదికి రూ. 2,772 కోట్ల నిధులు కేటాయించినట్లు మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. పేదల కడుపు నింపే యజ్ఞానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news