హుజూరాబాద్ సర్వే: లీడ్‌లోకి వచ్చింది ఎవరు?

-

హుజూరాబాద్ సర్వే | huzurabad survey : తెలంగాణ ప్రజల ఆసక్తి అంతా ఇప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నికపైనే. ఈ ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ ప్రజలందరిలోనూ ఉంది. అందుకు తగ్గట్టుగానే ప్రధాన పార్టీలు ఇక్కడ హోరాహోరీగా తలపడుతున్నాయి. ముఖ్యంగా ఈటల రాజేందర్, టీఆర్ఎస్‌ల మధ్య పోరు గట్టిగా జరిగేలా కనిపిస్తోంది. పైగా ఇక్కడ ఆయా పార్టీలు ఎప్పటికప్పుడు సొంతంగా సర్వేలు చేయించుకుంటూ, సరికొత్త వ్యూహాలతో ముందుకెళుతున్నట్లు కనిపిస్తున్నాయి.

Huzurabad | హుజురాబాద్
Huzurabad | హుజురాబాద్

అలాగే పలు స్వతంత్ర సంస్థలు సైతం హుజూరాబాద్‌లో మకాం వేసి ప్రజల నాడి పట్టుకునే పనిలో ఉన్నాయట. అయితే ఇప్పటివరకు వచ్చిన సర్వే అంచనాల ప్రకారం హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌కే లీడ్ ఉన్నట్లు కథనాలు వచ్చాయి. అందుకే సీఎం కేసీఆర్ హఠాత్తుగా వ్యూహాలు మార్చి, రాజేందర్‌కు చెక్ పెట్టడమే లక్ష్యంగా హుజూరాబాద్‌లో ముందుకెళుతున్నారు. ఇప్పటికే దళితబంధు పేరిట హుజూరాబాద్‌లో ఉన్న ఒక్కో దళిత కుటుంబానికి పది లక్షలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారనే సంగతి తెలిసిందే.

అలాగే తాజాగా ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన బండా శ్రీనివాస్‌ని నియమించారు. అటు పెన్షన్ వయసు 57 ఏళ్లకు కుదించడం, హుజూరాబాద్‌లో వందల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అదే విధంగా ఈటల సామాజిక వర్గానికే చెందిన గీస భిక్షపతి ముదిరాజ్‌ను కొమురెల్లి దేవస్థానం చైర్మన్‌గా నియమించారు.

ఈ పరిణామాలన్ని గమనిస్తే హుజూరాబాద్‌లో పైచేయి సాధించేందుకు కేసీఆర్ గట్టిగానే కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా దళితబంధు ప్రకటన తర్వాత తాజాగా టీఆర్ఎస్ వర్గాల సమాచారం ప్రకారం…హుజూరాబాద్‌లో కాస్త గులాబీ పార్టీకి అనుకూల వాతావరణం వచ్చిందని తెలుస్తోంది. అయితే ఉపఎన్నిక జరిగే లోపు, మరింతగా హుజూరాబాద్ ప్రజలపై కేసీఆర్ వరాల జల్లు కురిపించేలా ఉన్నారు. మరి వరాలకు హుజూరాబాద్ ప్రజలు కరిగి, కారుని కనికరిస్తారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news