RRR Pramotions : దేశాన్ని చూట్టేయ‌నున్న ఆర్ఆర్ఆర్ టీం.. 7 రోజుల్లో 9 న‌గ‌రాలు

-

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి కాంబినేషన్ లో వ‌స్తున్న ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఈ నెల 25న ప్ర‌పంచ వ్యాప్తంగా పాన్ ఇండియా రెంజ్ లో విడుద‌లు అవుతుంది. కాగ ఈ సినిమా విడుద‌ల కు ప్రమోషన్స్ లో రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్, రాజ‌మౌళి బిజీ బిజీ గా ఉన్నారు. వ‌రుస‌గా ఇంట‌ర్వ్యూ లు ఇస్తు.. సినిమా ప్ర‌మోట్ చేస్తున్నారు. రాజ‌మౌళి అంటే సినిమా చేయ‌డానికి ఎంత ప్రాముఖ్య‌త ఇస్తాడో.. ప్ర‌మోషన్స్ కు కూడా అంతే ప్రాముఖ్య‌త ఇస్తాడు.

అలాగే ఈ ఆర్ఆర్ఆర్ సినిమా ప్ర‌మోషన్స్ దేశ వ్యాప్తంగా సుడిగాలి పర్య‌ట‌న చేయ‌డానికి సిద్ధం అవుతున్నాడు. రేప‌టి నుంచి ఈ నెల 23 వ‌ర‌కు దేశం మొత్తం చుట్టి రానున్నారు. కాగ రేపు రాజ‌మౌళి, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్.. దుబాయ్ వెళ్ల‌నున్నారు. త‌ర్వాత ఈ నెల 19న బెంగళూరులో ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం పర్యటించనున్నారు.

చిక్బల్లాపూర్ లోని నిర్వహించే ప్రీ రీలిజ్ ఈవెంటో పాల్గోంటారు. అలాగే మార్చి 20న బరోడా తో పాటు ఢిల్లీ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి పర్యటిస్తారు. అనంత‌రం మార్చి 21న అమృతసర్, జైపూర్ లో ప‌ర్య‌టిస్తారు. మార్చి 22న కోల్ కతా, వారణాసిలో ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం ప‌ర్య‌టించి మార్చి 23న హైదరాబాద్ కు రానున్నారు. కాగ ఈ టూర్ ఆర్ఆర్ఆర్ సినిమా క‌లెక్షన్లు పెర‌గ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చిత్ర బృందం అంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news