ఢిల్లీలో జరగబోయే నీతి ఆయోగ్ సమావేశానికి పోయె ముఖంలేక, సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ముఖ్యమంత్రి అనడం హాస్యాస్పదమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు . శనివారం ముఖ్యమంత్రి మీడియా సమావేశం అనంతరం పత్రిక ప్రకటన విడుదల చేసిన డీకే అరుణ, నీతి ఆయోగ్ సమావేశంలో 4 గంటలు కూర్చొని, 4 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇస్తారనడం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా అని డీకే అరుణ ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ మీడియా సమావేశం పెట్టి గంటల తరబడి చేప్పే సోది ఎవరికి అవసరమని, నీకు భజన మండలి అవసరం ఉండచ్చని, బీజేపీకి అవసరం లేదని డీకే అరుణ మండిపడ్డారు. రాష్ట్రంలో 36 లక్షలు ఉన్న 57 ఏళ్లు వయస్సు నిండిన వారికి 2016 రూపాయల పెన్షన్ ఇస్తున్నానని
గప్పాలు కొడుతున్న ముఖ్యమంత్రి , తనకు బుద్ధి పుట్టినప్పుడు ఇస్తున్నాని కూడా చెప్తే బాగుండేదని, రాష్ట్రంలో మరో 10 లక్షల మంది పెన్షన్ దారులను గుర్తించామని చెబుతున్నాడని మండిపడ్డారు.
2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నాలుగు ఏళ్లుగా అమలు చేయకుండా, ఇప్పుడు ఎక్కడ ఎప్పుడు ఉప ఎన్నికలు వస్తాయో అని భయంతో , మరోసారి కొత్తగా మరో 10 లక్షల మందిని గుర్తించామని చెప్పి కొత్త రాగం మొదలు పెట్టీ మరోసారి ప్రజలను మోసం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని , రిటైర్డ్ ఉద్యోగులకు గత కొన్ని నెలలుగా పెన్షన్ లేదని, ప్రభుత్వ సిబ్బందికి ప్రతి నెల 15వ తేదీ తరువాత జీతం ఇస్తున్నారని డీకే అరుణ ధ్వజమెత్తారు. మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కెసిఆర్ , దేశ ప్రధాని పై అవ్వాకులు చెవ్వాకులు మాట్లాడడం దుర్మార్గమని, గంట 22 నిమిషాల మీడియా సమావేశం ఏర్పాటు చేసి, విలేకరుల అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా ముఖ్యమంత్రి మోహం చాటివేసాడని డీకే అరుణ ఎద్దేవా చేసారు.