అఘోరా అనగానే మనకు మైండ్‌లో ఒక పిక్చర్ వచ్చేస్తుంది.. ఒళ్లంతా బూడిద, బట్టలు లేకుండా నుదిటిన పెద్ద బొట్టు, విరబోసిన జుట్టు ఇలా.. అఘోరాల జీవనశైలి గురించి అందరూ ఏవేవో అనుకుంటారు.. వాళ్లు మానవుల పచ్చిమాంసం తింటారు, మృతదేహాలకు శారీరక సంబంధాలు పెట్టుకుంటారు ఇలా.. అసలు వారి జీవనశైలి ఎలా ఉంటుంది.. వారి గురించి కొన్ని ఆసక్తికరమైన నిజాలు మీ కోసం..!!
శవాలపై ఆరాధన
శివుని ఐదు రూపాలలో అఘోర ఒకటి. శివుడిని ఆరాధించడానికి అఘోరాలు మృతదేహంపై కూర్చొని సాధన చేస్తారు. ఈ విధంగా ‘మృతదేహం నుంచి శివుని పొందడం’ అఘోర సంస్కారానికి సంకేతంగా భావిస్తారు.. ఈ అఘోరాలు శవ సాధన అనే పేరుతో 3 రకాల సాధనలు చేస్తారు. అందులో భాగంగా మొదటిది మృత దేహానికి మాంసం, మద్యాన్ని సమర్పించడం. రెండోది మృతదేహంపై ఒంటికాలిపై నిలబడి శివుని ఆరాధించడం, మూడోది శ్మశాన వాటికలో సాధన.
ఎయిడ్స్, క్యాన్సర్‌కి నివారణ కలిగి ఉన్నారా?
చాలా మంది అఘోరీలు తాము ఎయిడ్స్, క్యాన్సర్‌కి నివారణ కలిగి ఉన్నామని అంటారు.. అయితే ఇది సైంటిఫిక్‌గా ప్రూవ్ అవలేదు. కానీ అఘోరాలు మృతదేహం నుంచి నూనెను తీయడం ద్వారా.. ఈ వ్యాధులకు నివారణను కనిపెట్టారని అంటారు..
పచ్చి మానవ మాంసం తింటారా..?
ఇంటర్వ్యూలు, డాక్యుమెంటరీల్లో చాలా మంది అఘోరాలు తాము పచ్చి మానవ మాంసాన్ని తింటామని అంగీకరించారు.. ఇది నిజమే. తరచుగా ఈ అఘోరాలు శ్మశాన వాటికల్లోనే నివసిస్తారు. సగం కాలిన మృతదేహాలను బయటకు తీస్తారు. ఆ మాంసాన్ని తింటారు. శరీర ద్రవాలను కూడా తాగుతారు. ఇలా చేయడం ద్వారా తంత్రం చేసే వారి శక్తి బలపడుతుందని వీరు నమ్ముతారు.
మృతదేహంతో శారీరక సంబంధం
అఘోరాలు మృత దేహాలతో శారీరక సంబంధం పెట్టుకుంటారనేది ఒక ప్రసిద్ధ నమ్మకం. ఈ విషయాన్ని స్వయంగా ఓ అఘోరానే వివరించారు.. శివుడినీ, శక్తినీ పూజించే విధానం ఇదేనని.. ఆయన వివరించారు. అధ్వాన్నమైనా భగవంతుని ఆరాధనకు, భక్తికి ఇదే సులువైన మార్గంగా వాళ్లు భావిస్తారు.. మృతదేహంతో శారీరక శ్రమ చేసే సమయంలో కూడా మనసు భగవంతుని భక్తిలో నిమగ్నమైతే ఇంతకంటే ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధన ఏ స్థాయిలోనూ ఉండదని వారి విశ్వాసం..
జీవించి ఉన్నవారితోనూ భౌతిక సంబంధాలు
స్త్రీ రుతుక్రమం జరుగుతున్న సమయంలో ఇలా చేయడం వల్ల అఘోరాల శక్తి పెరుగుతుందట.. ఇదే క్రమంలో వీరు జీవించి ఉన్న వారితోనూ సంబంధాలు పెట్టుకుంటారని చెబుతారు.
అఘోరాలు కుక్కలను మాత్రమే పెంచుకుంటారు
అఘోరీలకు కుక్కలంటే చాలా ఇష్టం. ఆవు, మేక వంటి అన్ని ఇతర జంతువులకూ దూరం ఉండే అఘోరాలు.. తన చుట్టూ కుక్కలను ఉంచుకోవడానికి ఇష్టపడతారు. మొత్తానికి అఘోరాల జీవనశైలి, పద్ధతులు ఇలా ఉంటాయి..