ఏ స్థానంలోనైనా బ్యాంటింగ్ చేస్తా – వెంక‌టేష్ అయ్య‌ర్

-

భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య టీ 20 సిరిస్ ప్రారంభం అయింది. ఈ రోజు జైపూర్ వేదిక గా ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య మొద‌టి టీ 20 మ్యాచ్ జ‌రుగుతుంది. అయితే ఐపీఎల్ హీరో వెంక‌టేష్ అయ్య‌ర్ ఈ మ్యాచ్ ద్వారా అంత‌ర్జాతీయ క్రికెట్ కు అరంగేట్రం చేస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్ ఆడ‌టం త‌న అదృష్టం అని అన్నాడు. కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆధ్వ‌ర్యం లో త‌న అరంగేట్రం ఉండ‌టం సంతోషం గా ఉంద‌ని అన్నారు. ఈ అవ‌కాశాన్ని త‌ప్ప‌కుండా ఉప‌యోగించు కుంటాన‌ని అన్నాడు.

అలాగే ఏ స్థానం లో అయిన బ్యాటింగ్ చేయ‌డానికి తాను సిద్ధంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించాడు. అలాగే జ‌ట్టు అదేశిస్తే బౌలింగ్ కూడా చేస్తాన‌ని అన్నాడు. అయితే వెంక‌టేష్ అయ్య‌ర్ ఐపీఎల్ 2021 లో కోల‌క‌త్త నైట్ రైడ‌ర్స్ ప్రాతినిథ్యం వ‌హించాడు. ఈ సిజ‌న్ లో వెంక‌టేష్ అయ్య‌ర్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. దీంతో బీసీసీఐ సెల‌క్ట‌ర్ల దృష్టి లో ప‌డ్డాడు. దీంతో న్యూజిలాండ్ తో జ‌రుగుత‌న్న టీ ట్వంటి సిరీస్ కు ఎంపిక చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news