హోమ్ లోన్ తీసుకునేటప్పుడు.. ఈ పొరపాట్లని అస్సలు చెయ్యద్దు..!

-

సొంత ఇల్లు కట్టడం అనేది చాలా మందికి వుండే కలల్లో అతి పెద్ద కల. ఆ కలని నెరవేర్చుకోవడానికి ఎంతగానో ట్రై చేస్తూ ఉంటారు. కొత్త ఇంటిని కట్టుకోవాలన్నా సొంత ఇంటి కలని నెరవేర్చుకోవాలన్నా హోమ్ లోన్ తో సాధ్యమవుతుంది. హోమ్ లోన్ తీసుకుని సొంతింటి కలని నెరవేర్చుకోవచ్చు అయితే చాలా మంది హోమ్ లోన్ విషయంలో కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. బ్యాంకులు లోన్స్ ని ఇస్తూ ఉంటాయి మనం ఆ లోన్ తీసుకుని సొంత ఇంటి కలని నెరవేర్చుకోవచ్చు అయితే హోమ్ లోన్ తీసుకునేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి.

చాలా సార్లు క్రమం తప్పకుండా లోన్ ని కట్టినా కూడా అనుకోని పరిస్థితులు లేదా ఇతర ఆర్థిక సంక్షోభాల కారణంగా ఈఎంఐలు చెల్లించకపోవచ్చు. ఇలా పే చేయకపోతే చెడు ప్రభావాన్ని చూపుతుంది. హోమ్ లోన్ ఈఎంఐ డిఫాల్ట్ చేయడం వల్ల ఏం అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఈఎంఐ డిఫాల్ట్ తరచుగా రుణగ్రహీత క్రెడిట్ స్కోర్‌ పడిపోతుంది. దీనితో మళ్ళీ లోన్ తీసుకోవాలన్న కష్టం అవుతుంది. లోన్ డిఫాల్ట్ ప్రభావం అసోసియేట్ దరఖాస్తుదారులపై కూడా ఉంటుంది.

ఇది ప్రధాన దరఖాస్తుదారుకు మాత్రమే పరిమితం కాదు. ఈఎంఐ చెల్లింపులో డిఫాల్ట్ క్రెడిట్ స్కోర్‌ దీని వలన తగ్గుతుంది. ఉపాధి నుంచి అద్దె గృహాల వరకు ఇబ్బందులను తీసుకు వస్తుంది. సమయానికి ఈఎంఐని డిపాజిట్ చేయనందుకు జరిమానా వంటివి కూడా ఉంటాయి. ఎంత అనేది బ్యాంకును బట్టి ఉంటుంది. అలానే రుణగ్రహీత ఈఎంఐ చెల్లింపుల మంచి ట్రాక్ రికార్డ్‌ను ఉంటే రానున్న రోజుల్లో టాప్-అప్ లోన్‌లు, వ్యక్తిగత రుణాలు, ఆకస్మిక రుణాలు వంటివి ఎంచుకోవచ్చు. డిఫాల్ట్‌గా ఒక్క ఈఎంఐని కూడా పూరిస్తే ఈ ఆఫర్‌లు వుండవు.

Read more RELATED
Recommended to you

Latest news