ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోకండి… కొంప మునుగుద్ది !

-

సోషల్ మీడియా మరింతగా విస్తరిస్తున్న కొద్దీ మరియు మానవుడు ఫోన్ లు మరియు టెక్నాలజీ ల మీదనా ఆధారపడుతున్న కొద్ది మార్కెట్ లోకి రకరకాల యాప్ లు వస్తున్నాయి. అయితే కొన్ని యాప్ లు మాత్రం డౌన్ లోఅస్సాద్ చేసుకున్న ఇబ్బంది లేకున్నా… కొన్ని యాప్ లు మాత్రం డౌన్ లోడ్ చేసుకుంటే మన వ్యక్తిగత సమాచారం అంతా సైబర్ దొంగల పాలిట వశం అవుతోంది. ఆ తర్వాత ఎన్ని ఇబ్బందులు కలుగుతాయి అన్నది తెలిసిందే. ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ పేరుతో ఒక ఫేక్ యాప్ irctcconnect.apk పేరుతో డౌన్లోడ్ చేసుకోవాలని వాట్సాప్ మరియు టెలిగ్రామ్ యాప్ లలో ప్రచారంలో ఉంది. కాగా ఇప్పటికే అధికారికంగా IRCTC వారు ఆ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవద్దని చెప్పారు.

కాగా ఇప్పటికే ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న వారి బ్యాంకు సంబంధిత సమాచారం సైబర్ దొంగల చేతికి వెళ్లినట్లు తెలుస్తోంది. మీ దృష్టికి యాప్ ను డౌన్లోడ్ చేసుకోమని వస్తే చేయవద్దని అందరూ హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news